దేశీయ కంపెనీ కార్బన్ పూర్తిస్థాయి హెచ్‌డీ డిస్‌ప్లేతో మొబైల్‌ని అందుబాటులోకి తేనుంది. పేరు Titanium S7.తాకేతెర పరిమాణం 5 అంగుళాలు. రిజల్యూషన్1920X1080 పిక్సల్స్. ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఓఎస్‌తో పని చేస్తుంది. డ్యుయల్ సిమ్‌తో వాడుకోవచ్చు. 1.5Ghz quad-coreప్రాసెసర్‌ని వాడారు. డ్యుయల్ కెమెరాలు ఉన్నాయి. వెనక 13 మెగాపిక్సల్... ముందు 2 మెగాపిక్సల్ సామర్థ్యంతో పని చేస్తాయి. వెనకున్న కెమెరాకి 'లెడ్‌ఫ్లాష్' సౌకర్యం ఉంది. ఇంటర్నల్ మెమొరీ 16 జీబీ. మెమొరీ సామర్థ్యాన్ని 32 జీబీ వరకూ పెంచుకునే వీలుంది. 3జీ, వై-ఫై, బ్లూటూత్.. నెట్‌వర్క్‌లతో వాడుకోవచ్చు. ధర సుమారు రూ.14,999. http://go o.gl/ARAoYc
0 comments:
Post a Comment