Subscribe For Free Updates!
Showing posts with label Telugu. Show all posts
Showing posts with label Telugu. Show all posts

Thursday, 5 December 2013

కార్బన్‌ ఇక హెచ్‌డీలోనూ...




దేశీయ కంపెనీ కార్బన్‌ పూర్తిస్థాయి హెచ్‌డీ డిస్‌ప్లేతో మొబైల్‌ని అందుబాటులోకి తేనుంది. పేరు Titanium S7.తాకేతెర పరిమాణం 5 అంగుళాలు. రిజల్యూషన్‌1920X1080 పిక్సల్స్‌. ఆండ్రాయిడ్‌ 4.2 జెల్లీబీన్‌ ఓఎస్‌తో పని చేస్తుంది. డ్యుయల్‌ సిమ్‌తో వాడుకోవచ్చు. 1.5Ghz quad-coreప్రాసెసర్‌ని వాడారు. డ్యుయల్‌ కెమెరాలు ఉన్నాయి. వెనక 13 మెగాపిక్సల్‌... ముందు 2 మెగాపిక్సల్‌ సామర్థ్యంతో పని చేస్తాయి. వెనకున్న కెమెరాకి 'లెడ్‌ఫ్లాష్‌' సౌకర్యం ఉంది. ఇంటర్నల్‌ మెమొరీ 16 జీబీ. మెమొరీ సామర్థ్యాన్ని 32 జీబీ వరకూ పెంచుకునే వీలుంది. 3జీ, వై-ఫై, బ్లూటూత్‌.. నెట్‌వర్క్‌లతో వాడుకోవచ్చు. ధర సుమారు రూ.14,999. http://go o.gl/ARAoYc

బుల్లి కెమెరా






వేసుకున్న షర్ట్‌కో... తలకు పెట్టుకున్న టోపీకో... కెమెరాని తగిలించుకుని వీడియో తీయాలనుకుంటే Looxie 3కెమెరా ఉంది. కేవలం 37 గ్రాముల బరువుడే కెమెరాతో వీడియోలు చిత్రీకరించొచ్చు. 750 పిక్సల్‌ రిజల్యుషన్‌తో రికార్డ్‌ చేస్తుంది. ఇన్‌బిల్ట్‌గా ఏర్పాటు చేసిన బ్యాటరీతో 1.5 గంటలు పని చేస్తుంది. దీంట్లో ఎస్‌కార్డ్‌ కూడా ఉంది. మెమొరీ సామర్థ్యం 64 జీబీ. ఫొటోలు కూడా తీసుకోవచ్చు. వై-ఫై ద్వారా లైవ్‌ స్ట్రీమింగ్‌ ద్వారా వీడియోలు చూడొచ్చు. యూఎస్‌బీ కేబుల్‌ ద్వారా పీసీని కనెక్ట్‌ చేసి వాడుకోవచ్చు. దుస్తుల్లో ఒదిగిపోయేలా వివిధ రంగుల్లో అందుబాటులో ఉంది. వీడియో స్ట్రీమింగ్‌కి ఐఓఎస్‌, ఆండ్రాయిడ్స్‌కి ప్రత్యేక ఆప్స్‌ కూడా ఉన్నాయి. కెమెరాని అమర్చుకునేందుకు ప్రత్యేక స్టాండ్స్‌, కవర్స్‌ కూడా ఉన్నాయి. ధర సుమారు రూ.6,300. http://goo.gl/9 T2VoD

Uc Browser...ఆప్‌ రివ్యూ!




పీసీలో మాదిరిగానే అన్ని హంగులతో మొబైల్‌ బ్రౌజర్‌ని వాడుకునేలా సరికొత్త వెర్షన్‌తో మరోటి ముందుకొచ్చింది. అదే UC Browser. ఆండ్రాయిడ్‌, ఐఫోన్‌, సింబియాన్‌, బ్లాక్‌బెర్రీ, విండోస్‌ ఫోన్‌, జావా బేస్డ్‌ ఓఎస్‌ యూజర్లు బ్రౌజర్‌ని వాడుకోవచ్చు. ట్యాబ్లెట్స్‌కి అనువుగా ప్రత్యేక సిస్టంని ఏర్పాటు చేశారు. దీంట్లోని సౌకర్యాల విషయానికొస్తే... బ్రౌజర్‌లో ఏదైనా కొత్త పేజీలో ఓపెన్‌ చేయాలంటే? ట్యాబ్‌ విండో తీసుకుని ఒకదాని తర్వాత ఒకటి సెలెక్ట్‌ చేసుకుని చూస్తాం. కానీ, దీంట్లో Auto Pager ద్వారా బ్రౌజర్‌లో ఓపెన్‌ చేసి ట్యాబ్‌లను స్క్రోల్‌ చేస్తూ ఒకదాని తర్వాత మరోటి చూడొచ్చు.

* వాడుతున్న నెట్‌వర్క్‌ కనెక్షన్‌ ఆధారంగా బ్రౌజర్‌ మోడ్‌ని మార్చుకునే వీలుంది. దీంతో వెబ్‌ పేజీలు వేగంగా ఓపెన్‌ అవుతాయి.

* బ్రౌజర్‌లో పెట్టుకున్న బుక్‌మార్క్‌లను క్లౌడ్‌ స్టోర్‌లోకి సింక్రనైజ్‌ చేసుకునే వీలుంది.

* 'డౌన్‌లోడ్‌ మేనేజర్‌' ద్వారా నెట్‌ నుంచి చేస్తున్న డౌన్‌లోడ్స్‌ని సులువుగా మేనేజ్‌ చేయవచ్చు. ఫైల్‌ ఎక్కడ డౌన్‌లోడ్‌ అవుతున్నదీ సులభంగా తెలుసుకోవచ్చు. డౌన్‌లోడ్‌ ప్రాసెస్‌లో ఉన్నవాటిని, బ్రోకెన్‌ డౌన్‌లోడ్స్‌ని గుర్తించడం చాలా వీజీ. నెట్‌వర్క్‌ సమస్య వల్ల డౌన్‌లోడ్స్‌ ఫెయిల్‌ అయ్యినప్పుడు తిరిగి అదే లింక్‌కి ఆటోమాటిక్‌గా కనెక్ట్‌ అయ్యి ఫైల్‌ని డౌన్‌లోడ్‌ చేస్తుంది.

* వై-ఫై కనెక్షన్‌ అందుబాటులో ఉన్నప్పుడు నోటిఫికేషన్‌ ద్వారా తెలియజేస్తుంది.

* నెట్‌వర్క్‌లో ఏదైనా సమస్య వస్తే నోటిఫికేషన్‌ ద్వారా తెలుసుకోవచ్చు.

* బ్రౌజర్‌ని క్లోజ్‌ చేసినప్పటికీ ఎలాంటి ఆటంకం లేకుండా బ్యాక్‌గ్రౌండ్‌లో డౌన్‌లోడ్‌ ప్రాసెస్‌ జరుగుతూనే ఉంటుంది.

* బ్రౌజర్‌లో సందర్శించిన ఏ వెబ్‌సైట్‌కి అయినా QR Codeజనరేట్‌ చేసుకుని సులభంగా షేర్‌ చేయవచ్చు.

* అన్నిసార్లు సైట్‌ యూఆర్‌ఎల్‌ని టైప్‌ చేయకుండా Add Gesture ద్వారా ఏదైనా ఆకారాన్ని గీయవచ్చు. ఇక ఎప్పుడైనా ఆ సైట్‌ని చూడాలంటే ఆకారాన్ని తెరపై గీసి సైట్‌లోకి వెళ్లొచ్చు.

* థీమ్స్‌తో బ్రౌజర్‌ని ఆకట్టుకునేలా మార్చుకునే వీలుంది.

* రాత్రి సమయంలో బ్రౌజ్‌ చేయాల్సివస్తే 'నైట్‌ మోడ్‌'ని సెలెక్ట్‌ చేసుకుని కళ్లకి ఎక్కువ ఒత్తిడి లేకుండా జాగ్రత్త పడొచ్చు.

* ప్రత్యేక యాడ్‌ఆన్స్‌ ద్వారా అదనపు సౌకర్యాల్ని బ్రౌజర్‌కి జత చేయవచ్చు. అందుకు తగిన 'యాడ్‌ఆన్‌ ప్లాట్‌ఫాం' ఉంది.

* హిస్టరీ సేవ్‌ అవ్వకుండా ఏదైనా వ్యక్తిగత బ్రౌజింగ్‌ చేయాలనుకంటే Incognito Browsing మోడ్‌ని ఎంపిక చేసుకోవచ్చు. డౌన్‌లోడ్‌, ఇతర వివరాలకుwww.ucweb.comలోకి వెళ్లిండి.

మొబైల్‌ చిట్కా!



స్మార్ట్‌ మొబైల్‌ వాడుతున్నవారందరూ 'పేట్రన్‌ లాక్‌' వాడుతూనే ఉంటారు. కొన్నిసార్లు లాక్‌ తీయడం మర్చిపోతుంటాం. లేదంటే కుటుంబ సభ్యులో, స్నేహితులో ఎక్కువ సార్లు ప్రయత్నించడం వల్ల పేట్రన్‌ లాక్‌ డిసేబుల్‌ అవుతుంది. మీ రిజిస్టరైన జీమెయిల్‌ ఐడీతో లాగిన్‌ అయితేనే తిరిగి పని చేస్తుంది. తిరిగి కొత్త పేట్రన్‌ లాక్‌ని సెట్‌ చేసుకోవచ్చు. కానీ, కొన్నిసార్లు రిజిస్టరైన జీమెయిల్‌ లాగిన్‌ వివరాలు కూడా మర్చిపోతే? పేట్రన్‌లాక్‌ని డిసేబుల్‌ చేయడం ఎలా? అందుకో చిట్కా ఉంది. ఫోన్ని రీస్టోర్‌ చేసి తిరిగి వాడుకోవచ్చు. ఇలా రీసెట్‌ చేస్తే మొత్తం యూజర్‌ డేటా, సెట్టింగ్స్‌ తొలగిపోతాయి. 'రీస్టోర్‌ ఫ్యాక్టరీ సెట్టింగ్స్‌' మాదిరిగా అన్నమాట. ఫోన్‌ మెమొరీ ఉన్న డేటా మొత్తం తొలగిపోతుంది. ఎస్‌కార్డ్‌లో మెమొరీ మాత్రం అలానే ఉంటుంది. ఇక చిట్కా చమత్కారం ఎలాగో చూద్దాం... మీరు ఆండ్రాయిడ్‌ మొబైల్‌ని వాడుతున్నట్లయితే లాక్‌ అయిన ఫోన్ని ముందుగా షట్‌డౌన్‌ చేయాలి. ఇప్పుడు ఫోన్‌లోని Volume Up బటన్‌ నొక్కి ఉంచితే 'ఆండ్రాయిడ్‌ రికవరీ స్క్రీన్‌' వస్తుంది. ఒకవేళ రాకపోతే పై రెండు కీలతో పాటు Home Screenబటన్‌ని కూడా నొక్కాలి. వచ్చిన రికవరీ స్క్రీన్‌లోని Wipe data/factory reset సెలెక్ట్‌ చేసి Yes ఆప్షన్ని ఎంపిక చేసుకోవాలి. దీంతో మొత్తం యూజర్‌ డేటా తొలగిపోయి తిరిగి రికవరీ స్క్రీన్‌ వస్తుంది. మెనూలోనిReboot System now ఆప్షన్ని సెలెక్ట్‌ చేయాలి. దీంతో ఫోన్‌ కొన్నప్పుడు ఎలా ఉందో అదే మాదిరిగా ఓపెన్‌ అవుతుంది. ఒకవేళ మీరు గతంలో యూజర్‌ డేటాని బ్యాక్‌అప్‌ చేసుకున్నట్లయితే తిరిగి సింక్రనైజ్‌ చేసుకోవచ్చు. ఇక్కడ మొబైల్‌ యూజర్లు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఒకటుంది. అదే డేటా బ్యాక్‌అప్‌. స్మార్ట్‌ మొబైల్‌ వాడే యూజర్లు డేటాని ఎప్పటికప్పుడు ఎస్‌డీ కార్డ్‌లోకి బ్యాక్‌అప్‌ చేసుకోవడం మంచిది. అనివార్య కారణాల వల్ల ఫోన్ని రీసెట్‌ చేస్తే డేటాని సురక్షితంగా బ్యాక్‌అప్‌ చేసుకోవచ్చు. ముఖ్యమైన మెసేజ్‌లు ఏవైనా ఉంటే 'స్క్రీన్‌ కాప్చర్‌' చేసుకుని భద్రం చేసుకోవడం మంచిది.

* డేటాని బ్యాక్‌అప్‌ చేసుకునేందుకు గూగుల్‌ ప్లేలో చాలానే ఆప్స్‌ ఉన్నాయి. వాటిల్లో 'సూపర్‌ బ్యాక్‌అప్‌' ఒకటి. అన్నింటినీ ఎస్‌డీ కార్డ్‌లోకి బ్యాక్‌అప్‌ చేసుకోవచ్చు. http://goo.gl/ZN0jtz

* ఆప్స్‌ని మాత్రమే బ్యాక్‌అప్‌ చేసుకునేందుకు App Backup & Restore ఉంది. http://goo.gl/aljDTj

గూగుల్‌ గంపలోకి...తాజా సరుకు!

                                                 వెతుకులాట...
                                                 వెబ్‌ విహారం...
                                              అవసరానికి ఆప్స్‌...
                                            దాచుకోవడానికి క్లౌడ్‌స్టోర్‌...
                                          ఇలా అన్నింటికీ అడ్డా గూగులే!
                                       ఇప్పుడు కొత్తగా మరికొన్ని చేరాయి!
                                          అవే 'క్రోమ్‌ బుక్‌',' క్రోమ్‌ బాక్స్‌'
మీకో.. ఇంట్లో కుటుంబ సభ్యలకో పీసీ కొనాలనుకున్నారనుకోండి. మార్కెట్‌లోకి కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, నోట్‌బుక్స్‌, నెట్‌బుక్స్‌, ట్యాబ్లెట్‌లను వెతికేస్తాం. ధరలు చూస్తాం. వాటిల్లోని సౌకర్యాల్ని తెలుసుకుంటాం. తర్వాతే ఏది కొనాలో నిర్ణయించుకుంటాం. ఇప్పుడు మీ జాబితాలోకి కొత్తగా 'క్రోమ్‌బుక్‌' వచ్చి చేరింది. తక్కువ బరువుతో నాజూకుగా యూజర్లను ఆకట్టుకుంటోంది. మార్కెట్‌లో ఇప్పటికే అందుబాటులో ఉన్న అన్ని పీసీలకు భిన్నంగా ఇది పని చేస్తుంది. కాన్ఫిగరేషన్‌లోనూ చాలా మార్పులు ఉన్నాయి. మరి, గూగుల్‌ ఇతర కంపెనీలతో సంయుక్తంగా అందిస్తున్న ఉత్పత్తుల సంగతులెంటో కాస్త వివరంగా తెలుసుకుందాం!


ఏంటి ప్రత్యేకతలు?
ఒక్కమాటలో చెప్పాలంటే ఇది కూడా నెట్‌బుక్‌ లాంటిదే. అంతర్జాలంలో నిత్యం విహరించేవారికి ఇదో సరైన వేదిక. దీంట్లో ఎలాంటి డిస్క్‌ డ్రైవ్‌లు ఉండవు. నెట్టింట్లో అందుబాటులో ఉన్న క్లౌడ్‌స్టోరేజ్‌నే వాడుకోవాలి. మరి, అప్లికేషన్లను ఎలా ఇన్‌స్టాల్‌ చేయాలంటారా? వాటినీ క్లౌడ్‌ స్థావరాల నుంచి వాడుకోవడమే. గూగుల్‌ అందించే 'వెబ్‌ స్టోర్‌' అందుకు ఉదాహరణ. సుమారు 30,000 ఆప్స్‌ దాంట్లో అందుబాటులో ఉన్నాయి. వాటిని ఎప్పుడైనా ఎక్కడైనా యాక్సెస్‌ చేయవచ్చు. ఇక సోషల్‌ నెట్‌వర్కింగ్‌, నెబ్‌ బ్రౌజింగ్‌ అంతా మామూలే. గూగుల్‌ అందించే 'డ్రైవ్‌'ని వాడుకోవచ్చు. ఆఫీస్‌ వర్క్స్‌ని చేసుకునేందుకు 'గూగుల్‌ డాక్స్‌' ఉండనే ఉంది. అలాగే, దీంట్లో మరో ముఖ్యమైన విషయం ఆపరేటింగ్‌ సిస్టం. విండోస్‌... లేదంటే లినక్స్‌ అనుకునేరు. అదేం కాదు. 'క్రోమ్‌ ఓఎస్‌' దీన్ని కూడా గూగుల్‌ బృందమే రూపకల్పన చేసింది. క్రోమ్‌ వెబ్‌ బ్రౌజర్‌ మాదిరిగానే ఇది పని చేస్తుంది. అన్ని ఓఎస్‌ల మాదిరిగానే దీనిపైనే క్లౌడ్‌ ఆప్స్‌ని రన్‌ చేసుకోవచ్చు. బ్యాక్‌గ్రౌండ్‌లో ఎప్పటికప్పుడు సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్స్‌ ఆటోమాటిక్‌గా జరిగిపోతాయి. సిస్టంని వాడుకోవాలంటే యూజర్‌ వాడే జీమెయిల్‌ ఐడీ వివరాలతో లాగిన్‌ అవ్వాలి.

కాన్ఫిగరేషన్‌ మాటేంటి?
సాధారణ ల్యాపీ మాదిరిగానే కనిపించే క్రోమ్‌ బుక్‌ తెర పరిమాణం 14 అంగుళాల వరకూ ఉంది. ఇంటర్నల్‌ స్టోరేజ్‌ 16 జీబీ. కావాలంటే 32 జీబీ వరకూ పెంచుకునే వీలుంది. ర్యామ్‌ విషయానికొస్తే 2 జీబీతో పని చేస్తుంది. ఇక డేటా స్టోరేజ్‌ కోసం గూగుల్‌ అందించే 'డ్రైవ్‌'ని వాడుకోవచ్చు. అంతేకాదు... అదనంగా గూగుల్‌ 100 జీబీ క్లౌడ్‌ స్టోరేజ్‌ స్పేస్‌ని రెండేళ్ల పాటు ఉచితంగా అందిస్తోంది. దీంతో పాటు... ఇతర ఉచిత క్లౌడ్‌ స్థావరాల్ని కూడా వాడుకోవచ్చు. ఉదాహరణకు 'డ్రాప్‌బాక్స్‌'. దీంట్లో సభ్యులైతే 2 జీబీ ఉచిత స్పేస్‌ని క్రోమ్‌బుక్‌కి వాడుకోవచ్చు. ఇతర ప్రీమియం డేటా ప్లాన్స్‌ కూడా ఉన్నాయి. అలాగే, మైక్రోసాఫ్ట్‌ అందించే 'స్కైడ్రైవ్‌' కూడా. 'బాక్స్‌' సర్వీసు నుంచి 5 జీబీని ఉచితంగా వాడుకోవచ్చు. 'షుగర్‌సింక్‌' మరోటి. దీంట్లోనూ 5 జీబీ ఉచితం. 'బిట్‌కాసా' క్లౌడ్‌ స్పేస్‌ నుంచి 5 జీబీని వాడుకునే వీలుంది. చెప్పాలంటే ఇంకా చాలా సర్వీసుల నుంచి క్లౌడ్‌స్పేస్‌ని ఉచితంగా వాడుకోవచ్చు. ఇంకో చిట్కా ఏంటంటే... ఎక్కువ స్పేస్‌ కోసం ఎక్కువ ప్రొఫైల్స్‌ క్రియేట్‌ చేసుకోవడమే. ఒక జీమెయిల్‌ ఎకౌంట్‌కి గూగుల్‌ డ్రైవ్‌ నుంచి 5 జీబీ ఉచితంగా కదా. మరో 5 జీబీ కావాలనుకుంటే మరో జీమెయిల్‌ ఎకౌంట్‌ క్రియేట్‌ చేసుకుంటే సరి.

ఎప్పుడూ నెట్‌ ఉండాలా?
క్రోమ్‌ బుక్‌ని వాడాలంటే ఎప్పుడూ నెట్‌ కనెక్షన్‌ అవసరమా? అనే సందేహం కచ్చితంగా వస్తుంది. ఆఫ్‌లైన్‌లోనూ క్రోమ్‌ బుక్‌ని వాడుకునే వీలుంది. జీమెయిల్‌ని యాక్సెస్‌ చేయవచ్చు. గూగుల్‌ డ్రైవ్‌లోని డాక్యుమెంట్స్‌ని యాక్సెస్‌ చేసి మార్పులు చేయవచ్చు. కొన్ని రకాల గేమ్స్‌ని కూడా ఆడొచ్చు. క్రోమ్‌ వెబ్‌ స్టోర్‌లో అందుకు అనువుగా ఆఫ్‌లైన్‌లో రన్‌ అయ్యే ఆప్స్‌ చాలానే ఉన్నాయి. వాటిని 'క్రోమ్‌ఓఎస్‌'కి యాడ్‌ చేసిన తర్వాత నెట్‌ కనెక్షన్‌ లేనప్పటికీ వాటిని వాడుకోవచ్చు. కానీ, ఎక్కువగా నెట్‌కి అనుసంధానమై పని చేసేవారికే క్రోమ్‌బుక్‌ అనుకూలం. ఇతర విండోస్‌ ఓఎస్‌తో పని చేసే ల్యాపీలతో పోలిస్తే బూట్‌ అయ్యేందుకు చాలా తక్కువ సమయం పడుతుంది. ఆన్‌ చేసిన తర్వాత

కేవలం 7 సెకన్లలోనే ల్యాపీ
వాడుకునేందుకు సిద్ధం అవుతుంది. బ్యాటరీ ఛార్జింగ్‌ కూడా ఎక్కువ సమయం వస్తుంది. ఒక్కసారి ఛార్జ్‌ చేసి 9.5 గంటలు వాడుకోవచ్చు. బరువు కూడా తక్కువే. ఎక్కువగా ప్రయాణాలు చేసే వారికి అనుకూలం. క్రోమ్‌బుక్‌లో ఏదైనా సమస్య వస్తే మొబైల్‌లో మాదిరిగా 'ప్యాక్టరీ రీసెట్‌' చేయవచ్చు. దీన్నే 'పవర్‌వాష్‌'గా పిలుస్తున్నారు. ల్యాపీలోని 'సెట్టింగ్స్‌'లోకి వెళ్లి రీసెట్‌ చేయవచ్చు. దీంతో ల్యాపీ కొన్నప్పుడు ఎలా ఉందో అలా మారిపోతుంది. ఇతరులెవరైనా ల్యాపీని వాడుకోవాల్సి వస్తే వారి జీమెయిల్‌ ఐడీతోనే లాగిన్‌ అయ్యి వాడుకోవచ్చు. ఒకవేళ ఇలా వాడడాన్ని డిసేబుల్‌ చేయాలంటే సెట్టింగ్స్‌లోకి వెళ్లి 'గెస్ట్‌ యాక్సెస్‌'ని డిసేబుల్‌ చేయాలి.

అంతా ఆప్స్‌తోనే...
క్రోమ్‌ ఓఎస్‌లో కావాల్సిన మీటలతో మీరే 'షార్ట్‌కట్స్‌'ని క్రియేట్‌ చేసుకోవచ్చు. అందుకు అనువైన ఆప్‌ 'క్రోమ్‌ వెబ్‌ స్టోర్‌'లో సిద్ధంగా ఉంది. అదే Shortcut Manager. ఓఎస్‌కి యాడ్‌ చేసుకుని కావాల్సినట్టుగా మార్పులు చేసుకోవచ్చు. http://goo.gl/rgVf5h

* క్రోమ్‌ బుక్‌లోనే ఇతర విండోస్‌, లినక్స్‌, మ్యాక్‌ ఓఎస్‌లతో పని చేసే ఇతర సిస్టంలనూ యాక్సెస్‌ చేయవచ్చు. అందుకు అనువైన ఆప్‌ ఒకటి వెబ్‌ స్టోర్‌లో ఉంది. అదే VNC Viewer for Google Chrome. ఆప్‌తో రిమోట్‌ యాక్సెస్‌ ద్వారా క్రోమ్‌ ఓఎస్‌లో ఇతర పీసీలను వాడుకోవచ్చు. http://goo.gl/2fCctF

* ఫొటోలను ఎడిట్‌ చేసేందుకు ఆడోబ్‌ లేదని చింతించక్కర్లేదు. వెబ్‌ స్టోర్‌ నుంచి Pixlr Editor ఆప్‌ని వాడొచ్చు. ఓఎస్‌కి యాడ్‌ చేసుకుని ఫొటోలను అప్‌లోడ్‌ చేసి ఎడిటింగ్‌ ప్రక్రియ చేపట్టవచ్చు.http://goo.gl/DNnktT

* ఫొటో ఎడిటింగ్‌కి మరోటి Sumo Paint.వివిధ రకాల మోడ్స్‌లో ఫొటోలను ఎడిట్‌ చేయవచ్చు.http://goo.gl/NZOP9m

* ఎమ్మెస్‌ ఆఫీస్‌ ఫైల్స్‌ని క్రోమ్‌లో చేసేందుకు Open with Office Web apps Viewer ఆప్‌ని వాడొచ్చు. http://goo.gl/NnlxbZ

ఇవి కొంచెం కష్టమే...
విండోస్‌లో వాడే అప్లికేషన్లను క్రోమ్‌బుక్‌లో వాడడం అసాధ్యం. వెబ్‌ స్టోర్‌లో అందుబాటులో ఉన్న ఆప్స్‌ని మాత్రమే ఇన్‌స్టాల్‌ చేసుకుని వాడుకోగలరు. ఫైర్‌ఫాక్స్‌, వీఎల్‌సీ ప్లేయర్‌, విన్‌రార్‌, ఎమ్మెస్‌ ఆఫీస్‌, అడోబ్‌ ఫొటోషాప్‌... లాంటి పేరొందిన సాఫ్ట్‌వేర్‌లను వాడడం కుదరదు. 3డీ గేమ్స్‌ని సపోర్ట్‌ చేయదు. తక్కువ ఇంటర్నల్‌ మెమొరీ ఉండడం వల్ల వీడియోలను సేవ్‌ చేయడం కష్టం. పెన్‌డ్రైవ్‌, ఎక్సటర్నల్‌ స్టోరేజ్‌ డ్రైవ్‌లతో సినిమాలు, వీడియో ఫైల్స్‌ని ప్లే చేసి చూడొచ్చు. ఎంపీ4 వీడియోలను మాత్రమే ఫుల్‌ రిజల్యుషన్‌లో చూడొచ్చు. ఎంకేవీ, ఎఫ్‌ఎల్‌వీ, డబ్యుఎంవీ వీడియో ఫార్మెట్‌ ఫైల్స్‌ ప్లే చేయలేం.
''క్రోమ్‌ బుక్‌ బూటింగ్‌ అయ్యేందుకు పట్టే సమయం కేవలం 7 సెకన్లే!
బ్యాటరీ బ్యాక్‌అప్‌ సుమారు 9 గంటలు!"


కొన్ని క్రోమ్‌బుక్‌లు...
హెచ్‌పీ కంపెనీతో జతకట్టి రూపొందించిన ల్యాపీనే HP Chromebook 14. తెర పరిమాణం 14 అంగుళాలు. రిజల్యూషన్‌ 1366X768పిక్సల్స్‌. 1.4GHz Intel Celeron 2955Uప్రాసెసర్‌ని వాడారు. స్టోరేజ్‌ సామర్థ్యం 16 జీబీ. గూగుల్‌ డ్రైవ్‌లోని 100 జీబీని రెండేళ్ల పాటు ఉచితంగా పొందొచ్చు.. ర్యామ్‌ 2జీబీ. Dongleసాయంతో 3జీ సేవల్ని వాడుకోవచ్చు. యూఎస్‌బీ పోర్ట్‌లు, కార్డ్‌ రీడర్‌ ఉన్నాయి. బ్లూటూత్‌, వై-ఫై సేవల్ని వాడుకోవచ్చు. బరువు 1.85 కేజీలు. బ్యాటరీ సామర్థ్యం 9.5 గంటలు. ధర సుమారు రూ.26,990.ఇతర వివరాలకు http://goo.gl/FXSFZ0లింక్‌లోకి వెళ్లండి.

* ఏసర్‌ కంపెనీతో ముందుకొచ్చిన మరో మోడల్‌ Acer C720. తెర పరిమాణం 11.6 అంగుళాలు. రిజల్యూషన్‌1366X768 పిక్సల్స్‌. 1.4GHz Intel Celeron 2955Uప్రాసెసర్‌ని వాడారు. మెమొరీ సామర్థ్యం 16 జీబీ. 100 జీబీ గూగుల్‌ డ్రైవ్‌ క్లౌడ్‌ స్టోరేజ్‌ని వాడుకోవచ్చు. ర్యామ్‌ 2జీబీ. వీజీఏ వెబ్‌ కెమెరా ఉంది. యూఎస్‌బీ పోర్ట్‌లు, కార్డ్‌ రీడర్‌ ఉన్నాయి. ల్యాపీ బరువు 1.25 కేజీలు. ధర సుమారు రూ.22,999.ఇతర వివరాలకు http://goo.gl/0AzzK5లింక్‌లోకి వెళ్లండి.

* శామ్‌సంగ్‌ మరో క్రోమ్‌ బుక్‌ని అందిస్తోంది.వివరాలకుhttp://goo.gl/YFBK7jలింక్‌ని చూడండి.

ఇదేమో 'క్రోమ్‌బాక్స్‌'
ఇంట్లోని మానిటర్‌కి 'క్రోమ్‌బాక్స్‌'ని కనెక్ట్‌ చేసి క్రోమ్‌బుక్‌లా వాడుకోవచ్చు. ఇదో రకం డెస్క్‌టాప్‌ పీసీ అన్నమాట. ChromeBox పీసీని తయారు చేసింది శామ్‌సంగ్‌ కంపెనీ. డెస్క్‌టాప్‌ పీసీల పక్కన కనిపించే సీపీయూ మాదిరిగా ఇది పని చేస్తుంది. దీని కాన్ఫిగరేషన్‌ విషయానికొస్తే... Intel Celeron Processorవాడారు. ర్యామ్‌ 4జీబీ. ఇంటర్నల్‌ స్టోరేజ్‌ 16 జీబీ. బిల్ట్‌ఇన్‌ వై-ఫై. 6 యూఎస్‌బీ పోర్ట్‌లు ఉన్నాయి. కీబోర్డ్‌, మౌస్‌లను బాక్స్‌కి కనెక్ట్‌ చేసి వాడుకోవచ్చు. డ్యుయల్‌ డిస్‌ప్లే పోర్ట్‌లు దీంట్లోని మరో ప్రత్యేకత. 30 అంగుళాల మానిటర్లకు కనెక్ట్‌ చేసి వాడుకోవచ్చు. క్రోమ్‌బుక్స్‌లో మాదిరిగానే గూగుల్‌ డ్రైవ్‌లోని 100 జీబీ క్లౌడ్‌ స్టోరేజ్‌ని రెండేళ్ల పాటు ఉచితంగా వాడుకోవచ్చు. ఇతర వివరాలకు http://goo.gl/V32Vfmలింక్‌లోకి వెళ్లండి.

క్రోమ్‌కి ప్రత్యేకం...
* క్రోమ్‌బుక్‌లో గేమ్స్‌ ఆడేందుకు 90's Gamesఆప్‌ని వెబ్‌స్టోర్‌ నుంచి ఇన్‌స్టాల్‌ చేసుకోవచ్చు. చిన్నప్పటి గేమ్స్‌కి ఇదో చిరునామా. http://goo.gl/jVtGdq

* ఫొటోలను ఆకట్టుకునేలా మలిచి సోషల్‌ లైఫ్‌లో పంచుకునేందుకు piZap Photo Editor ఆప్‌ని నిక్షిప్తం చేసుకోవచ్చు. http://goo.gl/ctlYH5

* ఆటలకు సంబంధించిన అప్‌డేట్స్‌ కోసం365Scoresఆప్‌ని వాడొచ్చు. http://goo.gl/AC7wao

* వీడియోలను ఎడిట్‌ చేసేందుకు WeVideoఆప్‌ ఉంది.http://goo.gl/poJJS7

* క్రోమ్‌బుక్‌పై సరికొత్త అప్‌డేట్స్‌తో ప్రయోగాలు చేస్తూ ప్రయోజనాల్ని పొందేందుకుwww.chromeexperiments.comసైట్‌లోని ఆప్స్‌ని ప్రయత్నించొచ్చు.

Thursday, 28 November 2013

పిట్టకొంచెం... కూత ఘనం!


ల్యాపీలు... స్మార్ట్‌ మొబైళ్లు. వాటిల్లో పాటలు... సినిమాలు. మరి, ఇన్‌బిల్ట్‌ స్పీకర్లతో వినడం కంటే... బ్లూటూత్‌ స్పీకర్లు ప్రయత్నించండి! ఎప్పుడైనా.. ఎక్కడైనా... వినడమేకాదు... కాల్స్‌ మాట్లాడొచ్చు కూడా! వాటి సంగతులేంటో చూద్దాం!
చేతిలో సరిపోతుంది
అన్ని సందర్భాల్లోనూ ఇయర్‌ఫోన్స్‌ పెట్టుకుని పాటలు వినలేం. అలాంటప్పుడు Bose SoundLink Mini స్పీకర్‌ని వాడొచ్చు. Bass Outputదీంట్లోని ప్రత్యేకత. మ్యూజిక్‌ ఫార్మెట్‌ ఏదైనా దీంట్లో ప్లే చేయవచ్చు. బ్లూటూత్‌ ద్వారా మొబైల్‌, ల్యాపీ, ఎంపీ3 ప్లేయర్లకు కనెక్ట్‌ అవుతుంది. స్పీకర్‌ పై భాగంలో కంట్రోల్‌ బటన్స్‌ని ఏర్పాటు చేశారు. స్పీకర్‌ని ఒకసారి ఛార్జ్‌ చేస్తే 6.5 గంటలు పాటు వాడుకోవచ్చు. మూడు గంటల్లో పూర్తిగా ఛార్జ్‌ అవుతుంది. ఛార్జింగ్‌ అవుతున్నప్పుడూ పాటలు వినొచ్చు. వివిధ రంగుల్లో స్పీకర్లు అందుబాటులో ఉన్నాయి. ధర సుమారు రూ. 16,200. http://goo.gl/dGbgel

రెండు రకాలుగా...

పాటలు వినడంతో పాటు అనివార్యమైన సందర్భాల్లో ఫోన్ని ఛార్జ్‌చేసే పవర్‌ బ్యాక్‌అప్‌ పరికరంగా వాడుకునేందుకు JBL Charge స్పీకర్‌ ఉంది. ల్యాపీ బ్యాక్‌ప్యాక్‌లో పెట్టుకుని ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. దీంట్లో నిక్షిప్తం చేసిన 6000mAhబ్యాటరీతో స్పీకర్‌ని 10 గంటల పాటు వాడుకోవచ్చు. అంతేకాదు... మొబైల్‌ ఛార్జింగ్‌ అయిపోతే యూఎస్‌బీ ద్వారా స్పీకర్‌కి కనెక్ట్‌ చేసి ఛార్జ్‌ చేయవచ్చు. ధర సుమారు రూ. 9,990.http://goo.gl/O0UJRS

కాల్స్‌ కూడా...

పోర్టబుల్‌ సైజుతో హ్యాండ్‌ బ్యాగ్‌లో ఇమిడిపోతుంది. స్పీకర్‌ పేరు Creative Airwave. పాటల్ని ప్లే చేయడంతో పాటు మీకొచ్చే కాల్స్‌ని కూడా వినిపిస్తుంది. అందుకు అనువుగా ఇన్‌బిల్ట్‌ మైక్‌ని ఏర్పాటు చేశారు. దీంతో మీరు ఫోన్‌కాల్స్‌ మాట్లాడొచ్చు. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే సుమారు 10 నుంచి 10.5 గంటలు పాటలు వినొచ్చు. బూట్లూత్‌ ద్వారా ఫోన్‌, ట్యాబ్‌, ల్యాపీలను కనెక్ట్‌ చేసి వాడుకోవచ్చు. ధర సుమారు రూ.6,999. http://goo.gl/Gd2Qya

ఒకదానితో ఒకటి

స్టీరీయో సౌండ్‌ సిస్టంతో పాటలు వినేందుకు అనువైందిHDMX Jam Plus. రెండు స్పీకర్లు ఒకదానితో మరోటి కనెక్ట్‌ అయ్యి 'కుడి, ఎడమ ఆడియో ఛానల్స్‌'ని ప్లే చేస్తాయి.BassOutputఆకట్టుకుంటుంది. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే నాలుగు గంటల పాటు వాడుకోవచ్చు. బ్లూటూత్‌ ద్వారా మొబైల్‌, ట్యాబ్‌, ల్యాపీలకు అనుసంధానం చేయవచ్చు. ఒక్కో స్పీకర్‌ ధర రూ.3,990. http://goo.gl/agDQVT

మరింత నాణ్యత
కారులో వెళ్తున్నప్పుడో... స్నేహితులతో పార్టీ చేసుకునేప్పుడో... మీకు ఇష్టమైన పాటల్ని వినాలంటేJabra Solemate స్పీకర్‌ని వాడొచ్చు. డ్రైవింగ్‌లో ఉన్నప్పుడు మీకు వచ్చే కాల్స్‌ని మాట్లాడేందుకు స్పీకర్‌లో ఇన్‌బిల్ట్‌ మైక్‌ కూడా ఉంది. Bass Output పూర్తి స్థాయిలో వినిపిస్తుంది. ఒకవేళ మీరు వాడుతున్న ఫోన్‌, ల్యాపీ, ట్యాబ్లెట్‌కి బ్లూటూత్‌ సదుపాయం లేకపోతే 3.5 ఎంఎం పిన్‌ ద్వారా స్పీకర్‌ని కనెక్ట్‌ చేయవచ్చు. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే టాక్‌టైం 10 గంటలు. పాటలు మాత్రం 8 గంటల పాటు వినొచ్చు. బ్యాటరీ స్టేటస్‌ని తెలుసుకునేందుకు ఇండికేటర్‌ ఉంది. ధర రూ.10,990. http://goo.gl/dVJ9CR

కొంచెం స్త్టెల్‌గా...

కాస్త ఆధునిక రూపంతో ఆకట్టుకునేలా బ్లూటూత్‌ స్పీకర్‌ని వాడుకోవాలనుకుంటే F&D M8 పోర్టబుల్‌ స్పీకర్‌ గురించి తెలుసుకోవాల్సిందే. బ్లూటూత్‌ ద్వారా స్పీకర్‌కి కనెక్ట్‌ అయ్యి 10 మీటర్ల పరిధిలో పాటలు వినొచ్చు. ఫోన్‌కాల్స్‌ కూడా మాట్లాడొచ్చు. స్పీకర్‌ని తీసుకెళ్లడానికి అనువుగా 'పౌచ్‌' ఉంది. యూస్‌బీ కేబుల్‌ ద్వారా ఛార్జ్‌ చేయవచ్చు. 3.5 ఎంఎం జాక్‌ ద్వారా కూడా స్పీకర్‌ని కనెక్ట్‌ చేయవచ్చు. ధర రూ.1,599. http://goo.gl/xQMWfq

చిన్నదే కానీ...
పరిమాణం చిన్నదేగానీ... పలికే సౌండ్‌ మాత్రం అదరాల్సిందే. అదే సోనీ కంపెనీ తయారు చేసిన SRS-BTV5 స్పీకర్‌. 'క్రిస్టల్‌ క్లియర్‌ సౌండ్‌'తో పాటలు వినొచ్చు. అంతేకాదు... ఇన్‌బిల్ట్‌గా ఏర్పాటు చేసిన 'స్పీకర్‌ఫోన్‌ బటన్‌'పై క్లిక్‌ చేసి ఎప్పుడైనా ఫోన్‌ కాల్స్‌ మాట్లాడే వీలుంది. 360 degree Circle Sound టెక్నాలజీతో స్పీకర్‌ అన్ని వైపులా మ్యూజిక్‌ వినిపిస్తుంది. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 5 గంటల పాటు మ్యూజిక్‌ వినొచ్చు. వినేటప్పుడే యూఎస్‌బీ కేబుల్‌ ద్వారా స్పీకర్‌ని ఛార్జ్‌ చేయవచ్చు.http://goo.gl/lFmbxa

'లాగీటెక్‌' కూడా...
పీసీ పరికరాల తయారీ కంపెనీ లాగీటెక్‌ కూడా Logitech UE BOOMBOX స్పీకర్‌ని అందిస్తున్నారు. స్పీకర్‌కి రెండు వైపులా కంట్రోల్‌ బటన్స్‌ని ఏర్పాటు చేశారు. 6 గంటలు పాటలు వినొచ్చు. ధర రూ.16,499.

చదువరులకు... చక్కని ఆప్స్‌!


స్మార్ట్‌ మొబైల్‌ చేతిలో ఉంటే...
ఆప్స్‌, అంతర్జాలమే కాదు...
ఈ-పుస్తకం కూడా చేతిలో ఉన్నట్టే!
పుస్తక ఫార్మెట్‌ ఏదైనా...
చక్కగా ఫోన్‌లోనే చదువుకోవచ్చు!
అందుకు తగిన ఆప్స్‌ సిద్ధం!



అంతా అంతర్జాలంలోనే. దిన పత్రికల దగ్గర్నుంచి అన్నీ డిజిటల్‌ ఫార్మెట్‌లోకి మారిపోతున్నాయి. పుస్తకాల గురించైతే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటికే అన్ని ఆన్‌లైన్‌ గ్రంథాలయాల్లో సందడి చేస్తున్నాయి. మరి, ఈ-పుస్తకాల్ని చదవాలంటే ఈ-బుక్‌ రీడర్లే అవసరం లేదు. వాటిని కొనలేకపోతే ఫోన్నే ఈ-బుక్‌ రీడర్‌గా మార్చేయవచ్చు. ఆయా ఆప్స్‌ని ఉచితంగా ఇన్‌స్టాల్‌ చేసుకుని మొబైల్‌ని మిని లైబ్రరీగా మార్చేయవచ్చు. అంతర్జాలంలోని ఆయా మొబైల్‌ ఆన్‌లైన్‌ స్థావరాల నుంచీ పుస్తకాల్ని ఉచితంగా పొందొచ్చు. గూగుల్‌ ఈ-బుక్స్‌, ఐఓఎస్‌ ఐబుక్స్‌ వేదికలే అందుకు ఉదాహరణ. ఇక పబ్లిక్‌ డొమైన్స్‌లోనూ ఈ-పుస్తకాలు అనేకం. PDF, ePub, Mobi... ఫార్మెట్‌ల్లో కనిపించే ఆయా పుస్తకాల్ని మొబైల్‌లోకి కాపీ చేసుకుని ఈ-బుక్‌ ఆప్స్‌తో చదువుకోవచ్చు. మరి, వాటి సంగతులేంటో వివరంగా తెలుసుకుందాం!

ఆండ్రాయిడ్‌ వాడితే...

మునివేళ్లపై పేజీలు తిప్పుతూ పుస్తకాలు చదువుకునేలా Aldiko Book Reader ఆప్‌ని వాడుకోవచ్చు. ఆండ్రాయిడ్‌ ప్లాట్‌ఫామ్‌పై రన్‌ అయ్యే ఈ-బుక్‌ అప్లికేషన్‌ను గూగుల్‌ ప్లే నుంచి ఉచితంగా ఇన్‌స్టాల్‌ చేసుకోవచ్చు. 200 దేశాల్లో 15 మిలియన్ల యూజర్లు వాడుతున్నారు. ఉచితం, ప్రీమియం వెర్షన్లలో అందుబాటులో ఉంది. epub, PDF ఫార్మెట్స్‌ని ఇది సోపర్ట్‌ చేస్తుంది. ఎంపిక చేసుకున్న పుస్తకాల్ని 'సెల్ఫ్‌'లో చూపిస్తుంది. పబ్లిక్‌ లైబ్రరీల నుంచి డౌన్‌లోడ్‌ చేసుకున్న ఈ-పుస్తకాల్ని సపోర్ట్‌ చేస్తుంది. పుస్తకాల్ని చదివేందుకు అనువుగా మార్పులు చేయవచ్చు. ఫాంట్‌ సైజుని పెంచుకునే వీలుంది. 'ఫాంట్‌ టైప్‌'ని కూడా మీరే ఎంపిక చేసుకోవచ్చు. పుస్తకంలోని బ్యాక్‌గ్రౌండ్‌ కలర్‌, మార్జిన్స్‌, ఎలైన్‌మెంట్స్‌, లైన్‌ స్పేస్‌లను చదివేందుకు అనువుగా మార్పులు చేయవచ్చు. కళ్లకు ఒత్తిడి లేకుండా పుస్తకం 'బ్రైట్‌నెస్‌'ని మార్పుకునే వీలుంది. రాత్రి సమయంలో పుస్తకాల్ని చదవాల్సివస్తే 'నైట్‌ టైం రీడింగ్‌' మోడ్‌ని సెలెక్ట్‌ చేయవచ్చు. ఫోన్స్‌, ట్యాబ్లెట్‌లోనూ ఆప్‌ని వాడుకోవచ్చు. పుస్తకాన్ని చదివేప్పుడు 'బుక్‌మార్క్‌'లను పెట్టుకునే వీలుంది. మొత్తం పుస్తకాల్ని టాగ్స్‌ ద్వారా ఆర్గనైజ్‌ చేయవచ్చు. పుస్తకాన్ని సెలెక్ట్‌ చేయగానే ఆటోమాటిక్‌గా చదువుతున్న పేజీలోకి తీసుకెళ్తుంది. ఎక్కువ సమయం ఈ-పుస్తకాల్ని చదువుతున్నట్లయితే బ్యాక్‌గ్రౌండ్‌ని నలుపు రంగులో సెట్‌ చేసుకుని టెక్స్ట్‌ రంగుని తెలుపుగా మార్చుకుంటే మంచిది. అప్‌ కావాలంటే http://goo.gl/FRj3h8 లింక్‌ నుంచి పొందొచ్చు.
* ఇలాంటిదే మరోటి Mantano Ebook Reader Lite. సులువైన ఇంటర్ఫేస్‌తో ఈ-పుస్తకాల్ని చదువుకునేలా ఆప్‌ని రూపొందించారు. http://goo.gl/Vkfl55.
* మరో పుస్తకాల స్థావరం Free Books & Stories- Wattpad.సుమారు 20 మిలియన్ల ఉచిత ఈ-పుస్తకాల్ని అందిస్తోంది. ఇదో పుస్తక ప్రియుల నెట్‌వర్క్‌. ఆప్‌లో లాగిన్‌ అయితే కావాల్సిన పుస్తకాలతో పెద్ద గ్రంథాలయాన్నే ఏర్పాటు చేయవచ్చు. నచ్చిన పుస్తకాలపై రివ్యూలు రాసి ఇతరులతో పంచుకోవచ్చు. నెట్‌వర్క్‌ సభ్యులతో ఛాట్‌ చేయవచ్చు. http://goo.gl/5U7Wic
* వివిధ రకాల ఫార్మెట్‌లతో కూడిన ఈ-బుక్స్‌ని చదివేందుకు AlReader-any type book Reader ఆప్‌ని వాడొచ్చు.http://goo.gl/QewFyP

బ్లాక్‌బెర్రీలోనూ...
క్వర్టీ కీబోర్డ్‌తోనే కాకుండా తాకే తెరతోనూ బ్లాక్‌బెర్రీ తన ప్రత్యేకతను చాటుకుంటోంది. బ్లాక్‌బెర్రీ ఆప్‌వరల్డ్‌తో అనేక ఆప్స్‌ని కూడా అందిస్తోంది. ఇప్పుడు ఫోన్ని ఈ-బుక్‌లా మార్చేసేలా PlayEpub Book Reader ఆప్‌ని అందిస్తోంది. ePub, Mobi, PDF ఫార్మెట్‌లను సపోర్ట్‌ చేస్తుంది. Portrait, Landscapeమోడ్స్‌లో ఆప్‌ని వాడుకోవచ్చు. ఆప్‌ రన్‌ చేయగానే ఫైల్‌ బ్రౌజర్‌లా కనిపిస్తుంది. అక్కడ కనిపించే పుస్తకాల్లో చదవాల్సిన పుస్తకంపై క్లిక్‌ చేస్తే ఓపెన్‌ అవుతుంది. చదువుకునేందుకు అనువుగా ఫాంట్‌, సైజు, లైన్‌ స్పేస్‌... అన్నింటినీ మార్పులు చేయవచ్చు. Day, Night మోడ్స్‌తో మరింత అనువుగా చదువుకోవచ్చు. పేజీల్లోని టెక్స్ట్‌ మేటర్‌ని 'హైలైట్‌' చేసుకునే వీలుంది. క్లిష్టమైన పదాలకు 'డిక్షనరీ' ఆప్షన్‌ ద్వారా అర్థాన్ని తెలుసుకునే వీలుంది. జిప్‌ ఫార్మెట్‌లో డౌన్‌లోడ్‌ చేసుకున్న పుస్తకాల్ని 'అన్‌జిప్‌' చేయవచ్చు. బుక్‌ కావాల్సిన మేటర్‌ని సెర్చ్‌ ద్వారా వెతకొచ్చు.http://goo.gl/JuLrZV

ఐఓఎస్‌ అయితే...

యాపిల్‌ స్థావరాలు అనేకం. వాటిల్లో పుస్తకాల స్థావరం కూడా ఒకటి ఉంది. అదే iBooks.ఐఫోన్‌ యూజర్లు ఉచితంగా ఈ-రీడర్‌ ఆప్‌ని వాడుకోవచ్చు. ఆప్‌ని నిక్షిప్తం చేసుకున్నాక ఐబుక్స్‌ స్టోర్‌ నుంచి కావాల్సిన పుస్తకాన్ని డౌన్‌లోడ్‌ చేసుకుని చదవొచ్చు. ఆప్‌లోని ఏడు రకాల ఫాంట్‌ స్త్టెల్స్‌లో కావాల్సిన స్త్టెల్‌ని ఎంపిక చేసుకోవచ్చు. మూడు రకాల పేజీ లేఅవుట్స్‌ ఉన్నాయి. పేజీ బ్యాక్‌గ్రౌండ్‌ రంగులు కూడా మూడే. పుస్తకంలో మీకు నచ్చిన టెక్స్ట్‌ మేటర్‌ని 'హైలైట్‌' చేసుకునే వీలుంది. అలాగే, పేజీలకు 'నోట్స్‌' కూడా రాసుకోవచ్చు. నచ్చిన పుస్తకానికి సంబంధించిన విశేషాల్ని ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌లో పోస్టింగ్‌లు చేసే వీలుంది. ఇన్‌బిల్ట్‌ సెర్చ్‌ ద్వారా పుస్తకంలోని పదాలు, వాక్యాల్ని వెతికే వీలుంది. 'స్క్రీన్‌ బ్రైట్‌నెస్‌'ని కావాల్సినట్టుగా సెట్‌ చేసుకోవచ్చు. ముఖ్యమైన పుస్తకాల్ని, వాటికి సంబంధించిన నోట్స్‌ని 'ఐక్లౌడ్‌'లోకి అప్‌లోడ్‌ చేసుకోవచ్చు. 'ఎయిర్‌ప్రింట్‌' ద్వారా పుస్తకాలపై రాసుకున్న నోట్స్‌ని ప్రింట్‌ తీసుకునే వీలుంది. పబ్లిక్‌ లైబ్రరీల నుంచి డౌన్‌లోడ్‌ చేసుకున్నePub, PDF ఫార్మెట్‌ పుస్తకాల్ని సపోర్ట్‌ చేస్తుంది. 18 భాషల పుస్తకాల్ని చదువుకోవచ్చు. పుస్తకాల్ని ఐపాడ్‌, ఐప్యాడ్‌లోనూ సింక్రనైజ్‌ చేసుకుని చదువుకోవచ్చు.http://goo.gl/tH9qsx

పెద్ద అడ్డా...
ఆండ్రాయిడ్‌ యూజర్లకు గూగుల్‌ ప్లే స్టోర్‌లో మరో పుస్తక స్థావరం ఉంది. అదే Books. కావాలంటేhttps://play.google.com/store/booksలింక్‌లోకి వెళ్లి పొందొచ్చు. స్టోర్‌లో ఉచిత విభాగం కూడా ఉంది. హోం పేజీలోని మెనూలోకి వెళ్లి రంగాల వారీగా పుస్తకాల్ని బ్రౌజ్‌ చేయవచ్చు. కొత్తగా మార్కెట్‌లోకి వచ్చిన పుస్తకాల్నిNew Arrivals విభాగంలో చూడొచ్చు. ఎక్కువ ఆదరణ పొందిన ఉచిత ఈ-పుస్తకాల్ని Top Free in books మెనూలోకి వెళ్లాలి. మీరు నిక్షిప్తం చేసుకున్న మొత్తం ఈ-బుక్స్‌ జాబితాని My books మెనూలో చూడొచ్చు.

ఇక్కడ ఈ-పత్రికలు
ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులో ఉన్న వార, మాస పత్రికల్ని మొబైల్‌లోనూ చూడాలంటే? అందుకో ఆప్‌ సిద్ధంగా ఉంది. అదే Zinio. ఆండ్రాయిడ్‌ యూజర్లు గూగుల్‌ ప్లే నుంచి ఉచితంగా ఇన్‌స్టాల్‌ చేసుకోవచ్చు. దీంట్లోని డిజిటల్‌ మ్యాగజైన్స్‌ 5000లకు పైమాటే. థంబ్‌నెయిల్‌ ఐకాన్స్‌లో పత్రికలు కనిపిస్తాయి. రంగాల వారీగా వీటిని పొందుపరిచారు. పత్రికల్ని ఫోన్‌లోకి సింక్‌ చేసుకున్నాక గ్రంథాలయంగా ఏర్పాటు చేసుకుని ఆఫ్‌లైన్‌లోనూ చదువుకోవచ్చు. కొత్త పత్రికల వివరాల్ని నోటిఫికేషన్స్‌ ద్వారా పొందొచ్చు.http://goo.gl/ZoRmmz
* ఐఫోన్‌ యూజర్లు http://goo.gl/PZ75Sm లింక్‌ నుంచి పొందొచ్చు.
* బ్లాక్‌బెర్రీ మొబైల్‌ వాడుతున్నట్లయితే 'బ్లాక్‌బెర్రీ వరల్డ్‌' నుంచి ఇన్‌స్టాల్‌ చేసుకోవచ్చు. ఇదిగో లింక్‌http://goo.gl/Olo7Ll

పుస్తక స్థావరాలు
*http://books.google.co.in/books

సెర్చింజన్‌ దిగ్గజం గూగుల్‌ అందించే ఈ-పుస్తకాల స్థావరం. ఉచిత పుస్తకాల్ని సిస్టం నుంచి కూడా చదువుకునే వీలుంది.

*www.gutenberg.org

ఇదో ఉచిత పుస్తకాల స్థావరం. సుమారు 42,000 ఈ-పుస్తకాల్ని డేటాబేస్‌లో నిక్షిప్తం చేశారు. కావాల్సిన పుస్తకాల్ని వెతికి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఎలాంటి సభ్యత్వం అక్కర్లేదు. మీరూ పుస్తకాల్ని డొనేట్‌ చేయవచ్చు.

*http://manybooks.net

దీన్ని పబ్లిక్‌ ల్రైబ్రరీగా చెప్పుకోవచ్చు. పేరొందిన పుస్తకాల్ని బ్రౌజ్‌ చేసుకుని పొందొచ్చు. ఎక్కువ ఆదరణ పొందిన పుస్తకాల్ని Papular Downloads మెనూలో చూడొచ్చు.

*www.booksinmyphone.com

స్మార్ట్‌ మొబైళ్లలోనే కాకుండా జావా ఎనేబుల్డ్‌ మొబైల్స్‌లోనూ బుక్స్‌ని డౌన్‌లోడ్‌ చేసుకుని చదువుకోవచ్చు. 'బ్రౌజ్‌ బుక్స్‌' మెనూలోకి వెళ్లి డేటాబేస్‌లోని పుస్తకాల్ని చూడొచ్చు. చదివేందుకు అనువుగా 'బుక్‌ సెట్టింగ్స్‌'ని మార్చుకునే వీలుంది.

*www.planetbook.com

నాణ్యతతో కూడిన పుస్తకాల్ని ఉచితంగా అందిస్తున్నారు. సాహితీ ప్రియులకు ఇదో చక్కని పుస్తక వేదిక.

*www.turnit.com

ఇదో పత్రికల స్థావరం. పేరొందిన అన్ని వార, మాస పత్రికల్ని ఇక్కడ పొందొచ్చు. ఉచిత విభాగంలోకి వెళ్లి అధికారికంగా పత్రికల్ని యాక్సెస్‌ చేయవచ్చు. డౌన్‌లోడ్‌ చేసుకోవాలంటే సైట్‌లో సభ్యులవ్వాల్సిందే.

*http://free.yudu.com

ఉచితంగా పుస్తకాల్ని నిక్షిప్తం చేసుకోవడం మాత్రమే కాకుండా మీరూ ఏదైనా పత్రికని ప్రారంభించొచ్చు. ఉచితంగా ఆన్‌లైన్‌ పబ్లిషింగ్‌ చేసేందుకు చక్కని వారధి.

Saturday, 23 November 2013

Meeru pampe mail lo beautiful blogs, sounds kallu tirigipooe emoticons kaavaala?



హాయ్ ఫ్రెండ్స్,

మెయిల్స్ తరచుగా పంపించే వారికి ఇది ఒక వరం లాంటిది. ఎప్పుడూ ఒకే టైప్ లో మెయిల్స్ పంపడం మానేయండి. మెయిల్ సందేశానికి అనుగుణంగా అందమైన చిత్రాలతో మీ భావాలను వ్యక్తపరచండి. అంతే కాకుండా మీ వాయిస్ రికార్డింగ్ మరియు ఇమేజిల్ ఇన్సెర్ట్ చేయడం, అటాచ్ మెంట్స్ , సిగ్నేచర్స్ లాంటి అన్నీ ఫీచర్స్ తో మెయిల్ పంపవచ్చు. outlook express లాగే ఉంటుంది. కానీ దానికన్నా అందంగా ఉంటుంది. ఒక సారి ఈ సాఫ్ట్వేర్ వాడి చూడండి. ఇక మీరు వదిలి పెట్టరు. ఫ్రీ వెర్షన్ ను డౌన్లోడ్ చేస్కోండి.ఇన్స్టాలేషన్ చేసి ఈ క్రింది విధంగా కన్ఫిగర్ చేయండి.

1. మొదట మీ gmail లోకి లాగిన్ అయి సెట్టింగ్స్ లో Forwarding and POP/IMAP >> Enable POP for all mail కు చెక్ మార్క్ పెట్టి Save Changes ను క్లిక్ చేయండి.



2. Incredi mail సాఫ్ట్వేర్ ను ఓపెన్ చేసి మీ పేరు మీ మెయిల్ ఐడీని ఎంటర్ చేసి Next బటన్ ను క్లిక్ చేయండి. తర్వాత మీ జీమెయిల్ పాస్వర్డ్ ను ఎంటర్ చేసి ఓకే చేయండి. ఇక అందమైన టెంప్లేట్స్ ను ఉపయోగించి మీ ఫ్రెండ్స్ కు మెయిల్స్ పంపేయండి.


Image has been scaled down 7% (600x524). Click this bar to view original image (644x562). Click image to open in new window.




బిజినెస్ మెయిల్స్ పంపాలనుకునే వాళ్లు ఇందులోని Letter Creater ద్వారా వాళ్ల బిజినెస్ కు సొంత టెంప్లేట్ తయారు చేస్కోవచ్చు
Image has been scaled down 15% (600x555). Click this bar to view original image (702x649). Click image to open in new window.


Friday, 22 November 2013

వీడియో కాలింగ్‌... ఇవిగో వారధులు!


వాడేది స్మార్ట్‌ మొబైలా? 3జీ నెట్‌వర్క్‌ ఉంటే చాలు... వీడియో కాలింగ్‌కి వేదికలెన్నో! 



మార్కెట్‌లోని స్మార్ట్‌ మొబైళ్లలో ఎక్కువ శాతం డ్యుయల్‌ కెమెరాలే. వీడియో కాలింగ్‌కి అనువుగా ఒక కెమెరాని వాడుకోవచ్చు. ఇక ఆప్‌ అడ్డాల్లో వీడియో కాలింగ్‌కి అనువైన అప్లికేషన్ల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నచ్చిన వాటిని బ్రౌజ్‌ చేసుకుని నిక్షిప్తం చేసుకోవచ్చు. మరి, మీరూ ఉచిత వీడియో కాలింగ్‌ ఆప్స్‌ని ప్రయత్నించాలనుకుంటున్నారా? అయితే, వీటిని వాడొచ్చు...

* WeChat
వేగంగా... సురక్షితంగా వీడియో కాల్స్‌ చేసేందుకు ఇదో వేదిక. సుమారు 300 మిలియన్ల యూజర్లు వాడుతున్నారు. టెక్స్ట్‌, వాయిస్‌ మెసేజ్‌లను కూడా పంపుకునే వీలుంది. ఫొటోలు, వీడియోలను కూడా షేర్‌ చేయవచ్చు. నోటిఫికేషన్స్‌ ద్వారా అలర్ట్‌లను పొందొచ్చు.అన్ని మొబైల్‌ ఓఎస్‌లకు అందుబాటులో ఉంది. www.wechat.com

* Tango
వీడియో, వాయిస్‌ కాల్స్‌ని ఉచితంగా చేసుకోవచ్చు. స్నేహితులు, కుటుంబ సభ్యుల్ని నిత్యం పలకరించేందుకు ఇదో చక్కని ఆప్‌. ఇన్‌స్టాల్‌ చేసి రన్‌ చేయగానే ఆటోమాటిక్‌గా ఆప్‌ని వాడుతున్న వారిని చూపిస్తుంది. 50 మంది స్నేహితులతో గ్రూప్‌ ఛాట్‌ చేయవచ్చు. యానిమేషన్‌ బొమ్మలతో మెసేజ్‌లను పంపే వీలుంది. కలిసి గేమ్స్‌ ఆడొచ్చు. ఆండ్రాయిడ్‌, యాపిల్‌, విండోస్‌ ఫోన్‌ యూజర్లు యాప్‌ని వాడొచ్చు.డెస్క్‌టాప్‌ పీసీల్లోనూ వాడొచ్చు. www.tango.me

* Fring Free
గ్రూపు కాల్స్‌ చేసేందుకు వాడొచ్చు. నలుగురితో ఒకేసారి వీడియో ఛాట్‌ చేయవచ్చు. ఉచితంగా టెక్స్ట్‌ మెసేజ్‌లు పంపొచ్చు. నోకియా సింబియాన్‌ యూజర్లూ వాడుకునే వీలుంది. www.fring.com

* Qik Video
వీడియో ఛాటింగ్‌ మాత్రమే కాకుండా మీరు చిత్రీకరించిన వీడియోలను స్ట్రీమింగ్‌ పద్ధతిలో పంచుకునేందుకు వీలుంది. రికార్డ్‌ చేసిన వీడియోలను సోషల్‌ నెట్‌వర్క్‌లో పోస్ట్‌ చేయవచ్చన్నమాట. http://qik.com

* ooVoo
ఒకేసారి 12 మంది స్నేహితులతో గ్రూపు ఛాట్‌ చేయవచ్చు. హై-డిఫినెషన్‌లో వీడియోలను చూడొచ్చు. నలుగురు స్నేహితుల్ని తెరపై చూడొచ్చు. వీడియోని చిత్రీకరించి స్టేటస్‌గా పెట్టుకునే వీలుంది. www.oovoo.com

* imo
కమ్యూనిటీగా ఏర్పడి వీడియో కాల్స్‌ చేయవచ్చు. స్నేహితులు, కుటుంబ సభ్యులతో గ్రూప్స్‌ క్రియేట్‌ చేయవచ్చు. https://imo.im

* Line
వాయిస్‌ కాల్స్‌తో పాటు వీడియో కాల్స్‌ని సపోర్ట్‌ చేస్తుంది. మెసేజ్‌లు కూడా పంపొచ్చు. http://line.naver.jp

* Camfrog
ఇదో వీడియో ఛాట్‌ కమ్యూనిటీ. ఆండ్రాయిడ్‌ యూజర్లుhttp://goo.gl/0NuphF లింక్‌ నుంచి పొందొచ్చు.

Thursday, 21 November 2013

నేర్చుకోవాలంటే నెట్టిల్లే!




ఏదైనా నేర్చుకోవాలంటే? తరగతి గదులు... పెద్దలు... పుస్తకాలు... సెమినార్‌లు... లాంటివి ఒకప్పటి వేదికలు. మరిప్పుడు ఒక్కటే వేదిక. అదేంటో ఎవ్వరిని అడిగినా టక్కున చెప్పేస్తారు ఇంటర్నెట్‌ అని. మీరు విద్యార్థులైనా... ఉద్యోగులైనా... గృహిణులైనా... నేర్చుకోవాలనే ఆసక్తి ఉండాలేగానీ నెట్టింట్లో వేదికలు అనేకం ఉన్నాయి. అంతా ఉచితమే. కావాల్సిందల్లా నెట్‌ వాడకంపై కాస్త పరిజ్ఞానం. ఇక మిమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు. అవేంటో కాస్త వివరంగా తెలుసుకుందాం!

ఫొటోగ్రఫీ కోసం...
కొత్త డిజిటల్‌ కెమెరా కొన్నాక ఏం చేస్తాం? ఎలా వాడాలి.. ఫొటోలు ఎలా క్యాప్చర్‌ చేయాలి... కెమెరాలో ఉన్న ఇన్‌బిల్ట్‌ ఫీచర్స్‌ని వాడడం ఎలా? లాంటి విషయాలపై శ్రద్ధ పెడుతుంటాం. అందుకోసం టుటోరియల్స్‌ని వెతుకుతుంటాం. అలాంటి వారికిhttp://photographycourse.netప్రత్యేకం. ప్రారంభ కోర్సుల దగ్గర్నుంచి ఫ్రొఫెషనల్‌ ఫొటోగ్రఫీ వరకూ చిట్కాల్ని తెలుసుకోవచ్చు. విభాగాల వారీగా విశేషాల్ని అందిస్తున్నారు. ఉదాహరణకు ఫొటో ఎడిటింగ్‌ గురించి తెలుసుకోవాలంటే Photo Editing మెనూలోకి వెళ్లాలి.


*ఇలాంటిదే మరోటి www.expertphotogra phy.com ఉచితం ఈ-పుస్తకాన్ని ఉచితంగా పొందొచ్చు. నిపుణుల రివ్యూల నుంచి చిట్కాల్ని నేర్చుకోవచ్చు.

*http://photo.net/learn/లింక్‌లోకి వెళ్లి ఫొటోగ్రఫీ విశేషాల్ని తెలుసుకోవచ్చు. వ్యాసాలు, టుటోరియల్స్‌ ఉన్నాయి. పెళ్లి వేడుకలో తీయాల్సిన ఫొటోలకు ప్రత్యేక విభాగం ఉంది. వ్యాసాల్లో ఎక్కువ శాతం ఆ రంగంలోని నిపుణులు రాసినవే.
*ఫొటోగ్రఫీకి సంబంధించిన రివ్యూలకుwww.dpreview.com/glossaryలింక్‌లోకి వెళ్లండి. కెమెరా సిస్టం, డిజిటల్‌ ఇమేజింగ్‌, ఆప్టికల్‌, స్టోరేజ్‌ అంశాలపై వ్యాసాల్ని చూడొచ్చు.

* ఆప్స్‌ని మొబైల్‌లో ఇన్‌స్టాల్‌ చేసుకుని కూడా ఫొటోగ్రఫీ విశేషాల్ని తెలుసుకోవచ్చు. అందుకు ఆండ్రాయిడ్‌ యూజర్లు Photography Tutorials ఆప్‌ని నిక్షిప్తం చేసుకోవచ్చు. సుమారు 2000 టుటోరియల్స్‌ ఉన్నాయి. http://goo.gl/QFWwoC

*యాపిల్‌ యూజర్లు ఐట్యూన్స్‌ నుంచి నిక్షిప్తం చేసుకోవచ్చు. http://goo.gl/m7rnlv

కంప్యూటర్‌ పాఠాలు
కంప్యూటర్‌ కోర్సుల కోసం ఇన్‌స్టిట్యూట్స్‌లో కుస్తీలు పడుతుంటారు. ఏదైనా సందేహం వస్తే నెట్‌లో అందుబాటులో ఉన్న క్లాస్‌రూంలోకి చొరబడతారు. జావాస్క్రిప్ట్‌, పీహెచ్‌పీ, పైథాన్‌, రూబీ... చెప్పాలంటే ఇలాంటి కోర్సుల్ని దాటించే ఆన్‌లైన్‌ అడ్డాలు చాలానే ఉన్నాయి. కావాలంటే www.codeacade my.com సైట్‌లోకి వెళ్లండి. మీరే కోడింగ్‌ చేసి సైట్‌ని డిజైన్‌ చేయవచ్చు. విభాగాల వారీగా లాంగ్వేజ్‌లను చూడొచ్చు. JavaScript, JQuery, PHP, Python, Ruby Web Projects, APIs విభాగాలు ఉన్నాయి. దీంట్లో సాధన చేసేందుకు సభ్యులవ్వక్కర్లేదు. సైట్‌ని 'ఫుల్‌స్క్రీన్‌' మోడ్‌లో సెట్‌ చేసుకునే వీలుంది. సభ్యులైతే ఎప్పటికప్పుడు ఆప్‌డేట్‌ అయ్యే వీలుంది.

* ప్రత్యేకంగా Rubyపాఠాల్ని అభ్యసించేందుకుhttp://rubylearning.com ఉంది.

* జావా, పైతాన్‌, రూబీ కోర్సులకు ప్రత్యేక 'వీధి' సిద్ధంగా ఉంది. అందులో జాయిన్‌ అవ్వాలంటేwww.learnstreet.comలో సభ్యులైపోండి.

* అన్ని రకాల కోర్సులకు అడ్డాగాhttp://net.tutsplus.comవెబ్‌ సర్వీసుని చెప్పుకోవచ్చు.
* ఇలాంటివి మరికొన్ని... www.w3schools.com, www.codeh s.com, www.hac kety.com

* ఐప్యాడ్‌ వాడుతున్నట్లయితే Treehouseఆప్‌ని నిక్షిప్తం చేసుకుని C, HTML, CSS, Java, PHP, Ruby...లాంటి కోర్సుల్ని సాధన చేయవచ్చు. http://goo.gl/fc6lAj
* మీరు వాడుతున్న ఆండ్రాయిడ్‌లోనే జావాస్క్రిప్ట్‌ రిఫరెన్స్‌ కావాలంటే JavaScript Ref ఆప్‌ని ఇన్‌స్టాల్‌ చేసుకోండి. http://goo.gl/Xo EEJO

భాష ఏదైనా...
అవసరం మేరకో... అలవాటుగానో... కొత్త భాషల్ని నేర్చుకోవాలంటే? ఇన్‌స్టిట్యూట్‌లను సంప్రదించడం మామూలే. నెట్‌లోనూ చాలానే 'స్పోకెన్‌ లాంగ్వేజీ' వెబ్‌ సర్వీసులు ఉన్నాయి. వీడియోలు, టెక్ట్స్‌ మెటీరియల్‌రూపంలో భోదన చేస్తున్నారు. కావాలంటేwww.talkenglish.comసైట్‌లోకి వెళ్లండి. విభాగాల వారీగా పాఠ్యాంశాల్ని పొందుపరిచారు. వాక్యాల్ని వింటూ చదవొచ్చు.

* ఇలాంటివి మరికొన్ని... www.spokenenglish.org, www.englishbanana.com,www.englishleap.com,http://freeenglishnow.comవీటిలో కొన్ని సైట్స్‌ నుంచి మెటీరియల్‌ని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. సాధన చేసేందుకు వర్క్‌షీట్‌లు కూడా ఉన్నాయి.క్విజ్‌ల్లో పాల్గొనొచ్చు.

* ఒకవేళ ఇంగ్లిష్‌తో పాటు ఇతర భాషల్ని నేర్చుకోవాలనుకుంటే www.linguanaut.com, www.openculture.comసైట్స్‌లోకి వెళ్లండి.

* మీ మొబైల్‌, ట్యాబ్స్‌లోనూ భాషల్ని మెరుగు పరుచుకోవాలంటే ఆండ్రాయిడ్‌ యూజర్లు Duolingoఆప్‌ని పొందండి. సులువైన ఇంటర్ఫేస్‌తో సాధన చేయవచ్చు.http://goo.gl/yUtWtr

* యాపిల్‌ యూజర్లు ఐట్యూన్స్‌ నుంచి ఉచితంగా నిక్షిప్తం చేసుకోవచ్చు. http://goo.gl/Q4PB1w

* లాంగ్వేజీ కమ్యూనిటీల్లో చేరేందుకు http://livemocha.com,http://lang-8.comఉన్నాయి.

డ్రాయింగ్‌ అడ్డాలు!
కుంచె చేతబట్టి మరో పికాసోలా మారాలనేది మీ లక్ష్యం అయితే ఆర్ట్‌ని సాన పెట్టుకునేందుకు ఆన్‌లైన్‌లో అనేక అడ్డాలున్నాయి. అందుకు ఉదాహరణేwww.artfactory.comవెబ్‌ సైట్‌. నిపుణులైన కళాకారుల శైలి, చిట్కాల్ని నేర్చుకోవచ్చు. గ్యాలరీలో ఆకట్టుకునే కళాత్మక చిత్రాల్ని చూడొచ్చు.

* ట్యుటోరియల్స్‌, వ్యాసాలు, టిప్స్‌తో ఆర్ట్‌ని మెరుగు పరుచుకునేందుకు http://thevirtualinstructor.com లోకి వెళ్లొచ్చు. వీడియోలు కూడా ఉన్నాయి.

* క్రియేటివ్‌గా 'క్రాఫ్ట్‌'లను రూపొందించేందుకుwww.instructables.comసైట్‌లోకి వెళ్లండి. సెర్చ్‌తో కావాల్సిన వాటిని వెతకొచ్చు. మీరు రూపొందించిన వాటిని కమ్యూనిటీతో పంచుకునే వీలుంది.

* చేతిలోనే మొబైల్‌నివాడుకునే డ్రాయింగ్‌ చేద్దాం అనుకుంటే How to Draw అప్‌ని వాడొచ్చు. మొబైల్‌లో ఒక్కో స్టెప్పు చూస్తూ గీయవచ్చు. వీడియో, ఇతర వివరాలకుhttp://goo.gl/qQeVg9
* ఐఫోన్‌ యూజర్లు http://goo.gl/rjksepలింక్‌లోకి వెళ్లండి.
* మరిన్ని డ్రాయింగ్‌ ఆప్స్‌కి ఆండ్రాయిడ్‌ యూజర్లుhttp://goo.gl/0fySeJలింక్‌ని చూడండి.

ఇక డ్యాన్స్‌!
అదిరేలా స్టెప్పులు వేయాలన్నా నెట్టింట్లోకి అడుగెట్టాల్సిందే. అందుకు యూట్యూబ్‌లో అనేక వీడియో టుటోరియల్స్‌ సిద్ధంగా ఉన్నాయి. అందుకు కీవర్డ్‌తో సెర్చ్‌ చేస్తే సరి. బాలీవుడ్‌ డ్యాన్స్‌ స్టెప్పులకు 'మై బాలీవుడ్‌ స్టుడియో' ఛానల్‌లో వీడియో పాఠాలు సిద్ధంగా ఉన్నాయి. చూస్తూ మీరూ డ్యాన్స్‌ని మెరుగు పరుచుకోవచ్చు. http://goo.gl/rZ6lMQ

* ఇంకా చెప్పాలంటే www.dancetothis.com వెబ్‌ సర్వీసులోకి వెళ్లొచ్చు. విభాగాల వారీగా వీడియోలను నిక్షిప్తం చేశారు. hip hop, pop, street, break dance...లాంటివి చాలానే ఉన్నాయి.

* మరో డాన్స్‌ వేదిక కావాలనుకుంటే http://goo.gl/8Op2Cmలింక్‌లోకి వెళ్లండి. వీడియోలను వీక్షించేందుకు హోం పేజీలోని లింక్స్‌పై క్లిక్‌ చేయండి.

* అలాగే, www.idance.netమరోటి. వీడియోలను ఎక్స్‌ప్లోర్‌ చేసి చూడొచ్చు.
* ఆండ్రాయిడ్‌ యూజర్లు మొబైల్‌ ద్వారా డ్యాన్స్‌ నేర్చుకునేందుకు http://go o.gl/LMZnAW లింక్‌లోకి వెళ్లండి.

పాకశాల సర్వీసులు
ఇంట్లో మీ అమ్మ వంట నేర్పలేదా? అనే అవకాశాన్ని ఇవ్వకుండా భార్యామణులు నెట్టింట్లో వంటకాల్ని వంటింట్లో చేసేస్తుంటే... బ్రహ్మచారులేమైనా తక్కువ తిన్నారా? ఎల్‌సీడీ తెరలపై చూస్తూ నాన్‌స్టిక్‌పై రుచుల్ని ఆరగించేస్తున్నారు. కావాలంటే ఈ సైట్‌లు చూడండి...www.indianfoodforever.comదీంట్లో మెనూల వారీగా అన్ని రకాల వంటల్ని చూడొచ్చు. ఆంధ్రా వంటకాలకు ప్రత్యేక మెనూ ఉంది.

* ఇంకాస్త కలర్‌ఫుల్‌గా వంటలు చేయాలంటేwww.sailusfood.com సైట్‌లోకి వెళ్లండి. పండుగలకు చేసుకునే వంటలకు ప్రత్యేక మెనూ ఉంది.
* మరో వంటల వేదిక www.vahrehvah.com.వీడియోలు చూస్తూ వంటను పూర్తి చేయవచ్చు. వంటల్లోని రకాలకు మెనూలు బ్రౌజ్‌ చేయండి. వంటల్లో సందేహాలకు సైట్‌ నిర్వాహకుల్ని అడగొచ్చు.

*మరిన్ని స్పెషల్‌ వంటకాలకు www.tarladalal.com, http://sify.com, www.sanjeevkapoor.com, www.manjulakichen, http://anjalipathak.comసైట్‌లను చూడొచ్చు.

*ఇంగ్లిష్‌ పదాల్ని ఎలా పలకాలో తెలుసుకోవాలంటేwww.soundsofenglish.orgసైట్‌లోకి వెళ్లండి.

*వీడియో క్లాస్‌లతో ఆంగ్లాన్ని అభ్యసించేందుకు Lets Talk Institute ఛానల్‌ని చూడండి. http://goo.gl/ogW0DG
మరికొన్ని...


* www.wikihow.com
అంశం ఏదైనా నేర్చుకునేందుకు అనేక వ్యాసాలు ఉన్నాయి. సభ్యులై మీరూ రాయొచ్చు.

* www.ehow.com
సందేహం ఏదైనా సమధానాల్ని అందిస్తుంది.

* www.hackaday.com
మెదడుకి మరింత పదును పెట్టేందుకు ప్రత్యేక వేదిక.

* www.makezine.com
క్రియేటివ్‌ వర్క్స్‌, విశేషాల్ని అందించే అడ్డా.

* www.makeuseof.com
వివిధ సైట్‌ల్లోని టెక్‌ అప్‌డేట్స్‌ని ఎప్పటికప్పుడు అందిస్తుంది.

* www.howcast.com
వీడియో టుటోరియల్స్‌ ఆధారంగా అన్నీ నేర్చుకోవచ్చు.

* www.videojug.com
ఇదో వీడియోల స్థావరం. కావాల్సిన అంశాన్ని సెర్చ్‌ చేసుకుని చూడొచ్చు.

Friday, 1 November 2013

*బరహా సహాయంతో ఫోటోషాప్ అడ్వాన్స్డ్ వర్షన్ లలో తెలుగు ను చక్కగా టైప్ చేయండిలా......

Photoshop నేర్చుకునే basic learners చాలా మంది Photoshop లో తెలుగు భాషను type చేయడానికి Anu Script Manager లాంటి software's ని ఉపయోగిస్తూ వాటితో కాస్త ఇబ్బంది మరియు కష్టపడుతూ తెలుగు ను type చేయడానికి ప్రయత్నిస్తుంటారు. Advanced Photoshop learners కి ఇది ఒక పెద్ద సమస్య కాకపోవచ్చు. కానీ, basic learners కి ఇది ఒకింత ఇబ్బందే మరియు కష్టమైన పని కూడా. :)   

Anu Script Manager లాంటి software's కి ఒక ప్రత్యామ్నాయంగా Baraha అనే software, Photoshop నేర్చుకునే basic learners / user's కి తెలుగు ను type చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ Baraha application సహాయంతో Photoshop Advanced versions (CS6) లో సైతం తెలుగు భాషను ఏ ఇబ్బంది లేకుండా చాలా సులువుగా మరియు తేలికగా type చేయవచ్చు. అలాగే,  Adobe InDesign CS6 లో కూడా Baraha ద్వారా తెలుగు ను చక్కగా type చేసుకోవచ్చు.


Baraha application ను ఉపయోగించి Photoshop లో తెలుగు భాషను type చేసే విధానాన్ని గురించి ఈ http://bit.ly/15yAeTl Video tutorial లో చాలా వివరంగా చూపించడం జరిగింది. ఆసక్తిగలవారు ఈ పాఠాన్ని చూసి నేర్చుకోగలరు.   

Tuesday, 29 October 2013

సులభంగా ga YouTube వీడియోలను డౌన్లోడ్ chesukovadaniki ఈ సైట్ అనుసరించండి ......

       సులభంగా గో YouTube వీడియోలను డౌన్లోడ్ chesukovadaniki ఇ లింక్ను అనుసరించండి...



                                                       http://catchvideo.net/

Friday, 18 October 2013

చేతిరాతను కేప్చర్ చేసే డిజిటల్ పెన్....

 ఇది అచ్చం బాల్ పాయింట్ పెన్ మాదిరిగా ఉంటుంది. బాల్ పాయింట్ పెన్లో మాదిరిగానే ఇందులో ఇంక్ కూడా పొందుపరచబడి ఉంటుంది. అయితే మామూలు పెన్ కీ దీనికీ ఉన్న వ్యత్యాసం.. ఈ పెన్ తో మనం పేపర్ పై రాసే సమాచారం మొత్తం ఆ పెన్ లోనే అంతర్గతంగా అమర్చబడి ఉన్న మెమరీలోకి కాపీ చేయబడుతుంది. ఆ తర్వాత ఆ పెన్ ని కంప్యూటర్ కి కనెక్ట్ చేసుకుని అందులోని సమాచారాన్ని ట్రాన్స్ ఫర్ చేసుకుని Microsoft Word వంటి ప్ర్లోగ్రాముల్లో ఎడిట్ చేసుకోవచ్చు. మన చేతిరాతని విశ్లేషించి దానిని హ్యాండ్ రైటింగ్ రికగ్నిషన్ టెక్నాలజీ ద్వారా డిజిటల్ రూపంలోకి మార్చే ఈ పెన్ తో పాటు అందించబడే సిడిలో ఇస్తున్నారు. సో.. మీరు విధ్యార్థులు,జర్నలిస్ట్లులు, ఇతర ప్రొఫెషనల్స్ అయితే మీరు పేపర్ పై రాసిన మేటర్ని తిరిగి టైప్ చేయవలసిన అవసరం లేకుండా ఈ పెన్ సాయంతో నేరుగా డిజిటల్ రూపంలోకి మార్చుకోవచ్చన్నమాట.

Friday, 11 October 2013

oCam - ఒక మంచి ఫ్రీవేర్ డెస్క్టాప్ స్క్రీన్ రికార్డింగ్ సాఫ్ట్వేర్.......



ఈ సాఫ్ట్వేర్ ఫీచర్స్: 

* సింపుల్ User Interface మరియు సులువైన Recording tools options.
* High Quality & HD Recording ability.
* ఈ సాఫ్ట్వేర్ యొక్క మరిన్ని వివరాల కోసం ఈ లింకు చూడండి:http://ohsoft.net/product_ocam.php.


Image and video hosting by TinyPic
గమనిక: ఈ సాఫ్ట్వేర్ previous (older) version 8.0 లేదా అంతకుముందు వాటిలో మనకు కావల్సిన video codec (ఉదా:techsmith video codecXvid, x264, vp8) లను install చేసుకుని వాటిని ఉపయోగించి video recording చేసే సదుపాయం ఉండేది. కానీ, ప్రస్తుత version 11.0 లో ఈ AVI, MP4, MOV, TS, VOB ఫార్మాట్ వంటి కొన్ని video codec లను మాత్రమే built-in గా అందించడం జరిగింది. కనుక, ప్రస్తుత version లో వాటిని తప్ప మనం మనకు కావల్సిన వేరే ఇతర ఏ video codec లను install చేసి వాడలేము. 

ఒకవేళ మీకు కావల్సిన video codec (ఉదా: techsmith video codec) లనే ఉపయోగించి video recording చెయ్యాలనుకుంటే గనక ఈ సాఫ్ట్వేర్ యొక్క older version 8.0 ని డౌన్లోడ్ చేసుకొని వాడవచ్చు.

Older Version download link: http://ohsoft.net/pds/oCam_v8.0.0.0.exe

Friday, 4 October 2013

వాల్ పేపర్స్ అటోమెటిక్ గా ఛే౦జ్ అవ్వాలా ?

జనరల్ ఏదైనా వాల్ పేపర్ సెట్ చేస్తే మళ్లి అది ఛే౦జ్ చేసేవరకు అలానే ఉ౦టు౦ది కదా! అలా కాకు౦డా డెస్క్ టాప్ పై వాల్ పేపర్లు ఎప్పటికప్పుడు అటోమెటిక్ ఛే౦జ్ అవుతూ ఉ౦డాల౦టే John’s Background Switcher అనే సాఫ్ట్ వేర్ ను ఉపయోగి౦చ౦డి. దీనితో మన పీసిలో లో ఉన్న ఇమేజ్ లతో పాటు Flickr, Phanfare, SmugMug, Picasa వ౦టి ఆన్ లైన్ ఫోటో షేరి౦గ్ సైట్స్ ను౦చి కూడా ఇమేజ్ లను సెలెక్ట్ చేసుకోవచ్చు కుడా! దీనిని ఉపయోగి౦చడ౦ కూడా చాలా ఈజీ, ము౦దుగా మీరు ఇమేజ్ లను మీ ఫోల్డర్ లేక ఆన్ లైన్ ఫోటో షేరి౦గ్ సైట్స ను౦చి సెలెక్ట్ చేసుకుని ఒక్కో వాల్ పేపర్ ఎ౦త సేపు ఉ౦డాలో టైమ్ సెట్ చేస్తే చాలు!

Tuesday, 1 October 2013

ఓపెన్ సోర్సు softwares డౌన్లోడ్ చేసుకోవడానికి రెండు మంచి వెబ్సైట్లు.





మంచి మంచి ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్స్ డౌన్లోడ్ చేసుకోవడానికిమరియు ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్స్ డెవలప్ చేయ్యడానికి ఓ మంచివెబ్సైట్ ఉంది, అదే  http://www.sourceforge.net/ఓపెన్సోర్స్ సాఫ్ట్వేర్స్ అంటే అమితంగా ఇష్టపడేవారికి ఈ సోర్స్ ఫోర్జ్వెబ్సైట్ ఓ మంచి లొకేషన్.


విండోస్ లో వాడుకోదగ్గ అత్యంత మంచివి మరియు పాపులర్ ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్స్ యొక్క సింపిల్లిస్ట్ కోసం  http://www.opensourcewindows.org/ వెబ్సైట్ ను చూడండి.  వెబ్సైట్ లోకుడివైపు ఉన్న Open Source Mac లింకు ను క్లిక్ చేస్తే Mac లో వాడుకోదగ్గ ఓపెన్ సోర్స్సాఫ్ట్వేర్స్ యొక్క లిస్ట్ మీకు కనిపిస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం వెబ్సైట్లలో నుంచి మీకునచ్చిన ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్స్ ను డౌన్లోడ్ చేసుకోండి.

Friday, 27 September 2013

బుల్లి 'ఆప్స్‌'..




పీసీలు, ల్యాపీలకు సవాల్‌ విసురుతూ ఆప్స్‌ రూపంలో అనేక అప్లికేషన్లు మొబైల్‌ యూజర్లను ఆకట్టుకున్నాయి. ఆయా ఫ్లాట్‌ఫాంలకు సరిపడే ఆప్స్‌ని మార్కెట్‌ల నుంచి యూజర్లు డౌన్‌లోడ్‌ చేసుకుని వాడేస్తున్నారు. ఈ నేపథ్యంలో 2012లో ఆకట్టుకున్న కొన్ని...
క్షణాల్లోనే...
Google Now. విషయం ఏదైనా క్షణాల్లో వివరాల్ని తెలుసుకునేందుకు ఇదో వారధి. ఆండ్రాయిడ్‌ యూజర్లు గూగుల్‌ ప్లే నుంచి ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. 'వాయిస్‌ సెర్చ్‌'తో మాట్లాడితే చాలు. డేటా సేకరించి ముందుంచుతుంది. http://goo.gl/70jtf

ఫొటోలకు ప్రత్యేకం

Camera Awesome. కెమెరా కంటికి అదనపు హంగులు అద్దుతుంది. వివిధ రకాల ఎఫెక్ట్‌లతో ఫొటోలను తీయడమే కాకుండా ఎడిటింగ్‌ కూడా చేయవచ్చు.http://goo.gl/rwhKS

వీడియో పాఠాలు

Khan Academy. విద్యార్థులకు సంబంధించిన ఎడ్యుకేషన్‌ వీడియోలతో ముందుకొచ్చింది. యూట్యూబ్‌ని వేదికగా చేసుకుని గణితం, భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం... వీడియోలను చూడొచ్చు. http://goo.gl/1dfqV

మ్యూజిక్‌ మ్యాజిక్‌
Songza. ఈ మ్యూజిక్‌ ఆప్‌ను ఐట్యూన్స్‌ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఎలాంటి వాణిజ్య ప్రకటనలు లేకుండా ప్రత్యేక ప్లేయర్‌లో మ్యూజిక్‌ ఆల్బమ్స్‌ని బ్రౌజ్‌ చేసి వినొచ్చు. నిద్రకు ముందు ఆహ్లాదకరమైన ట్యూన్స్‌ని వినేందుకుBedtime సెలెక్ట్‌ చేస్తే సరి. http://goo.gl/eQWK5

అడ్రస్‌బుక్‌

Youlu Address Book. కుటుంబ సభ్యులు, స్నేహితులు... ఇలా అందరి ఫోన్‌ నెంబర్లు, అడ్రస్‌లను మొబైల్‌లో మేనేజ్‌ చేసుకునేందుకు ఇదో సులువైన వారధి. ఒక్కమాటలో చెప్పాలంటే ఇదో 'కాంటాక్ట్‌ మేనేజ్‌మెంట్‌ టూల్‌'. http://goo.gl/c9l5a

పెద్ద లైబ్రరీ
Wattpad. ఇదో పుస్తక ప్రియుల అడ్డా. ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులో ఉన్న మిలియన్ల పుస్తకాల్ని బ్రౌజ్‌ చేసి చదవొచ్చు. సుమారు 10 మిలియన్ల పుస్తకాలు ఉచితంగా అందుబాటులో ఉన్నాయి. ఆండ్రాయిడ్‌ యూజర్లు గూగుల్‌ ప్లే నుంచి పొందొచ్చు. http://goo.gl/Kl6MH
* ఐఫోన్‌ యూజర్లు ఐట్యూన్స్‌లోకి వెళ్లండి.http://goo.gl/TWNg6

అన్నీ ఒకేచోట
Flipboard. వార్తాంశాల్ని, సోషల్‌ నెట్‌వర్క్‌ అప్‌డేట్స్‌ని ఒకేచోట అందిస్తోంది. 'న్యూస్‌ మ్యాగజైన్‌'గా దీన్ని పిలుస్తున్నారు. ఫోనుల్లో మాత్రమే కాకుండా ట్యాబ్‌ల్లో కూడా ఆప్‌ని వాడుకోవచ్చు. సెర్చ్‌ ద్వారా కావాల్సిన వాటిని వెతికే వీలుంది.http://goo.gl/GjO7x
* ఐఫోన్‌ యూజర్లు ఐట్యూన్స్‌ నుంచి పొందొచ్చు.http://goo.gl/Hp70z

బ్లాక్‌ చేస్తుంది
Call Blocker. అక్కర్లేని కాల్స్‌ని బ్లాక్‌ చేస్తుంది. నోకియా యూజర్లు ఒవీ స్టోర్‌ నుంచి ఉచితంగా పొందొచ్చు.http://goo.gl/7YWBP
* ఆండ్రాయిడ్‌ యూజర్లు గూగుల్‌ ప్లే నుంచి పొందొచ్చు. http://goo.gl/E5zwr

రక్షణ వలయం

BlackBerry Protect. ఫోన్‌లో భద్రం చేసిన డేటా సురక్షితం చేస్తుంది. ఆప్‌ని ఇన్‌స్టాల్‌ చేసి సైట్‌లో సభ్యులవ్వడం ద్వారా మొబైల్‌ పొగొట్టుకున్నప్పుడు ఫోన్‌ని పని చేయకుండా తాళం వేయవచ్చు. లేదంటే డేటా మొత్తాన్ని డిలీట్‌ చేయవచ్చు. http://goo.gl/n9eYQ

మరింత ఆకట్టుకునేలా...

Photo Studio. బ్లాక్‌బెర్రీలో తీసుకున్న ఫొటోలను ఎడిట్‌ చేసేందుకు ఇదో ప్రత్యేక ఫొటో ఎడిటింగ్‌ సూట్‌. ఆప్‌ నుంచే ఎడిట్‌ చేసిన ఫొటోలను షేర్‌ చేయవచ్చు. http://goo.gl/FRFmB
* నోకియా యూజర్లు ఒవీ స్టోర్‌ నుంచి పొందొచ్చు.http://goo.gl/HlGys

తాకితే చాలు

History Eraser. మొబైల్‌లో నిత్యం స్టోర్‌ అయ్యే హిస్టరీని తుడిచేసే క్లీనర్‌. బ్రౌజింగ్‌ హిస్టరీ, కాల్‌ లాగ్‌, టెక్స్ట్‌ మెసేజ్‌లు, క్లిప్‌బోర్డ్‌ డేటా, జీమెయిల్‌ సెర్చ్‌ హిస్టరీ... ఇలా అన్నింటినీ తొలగించొచ్చు. http://goo.gl/K3TPy

ఇదో వారధి
ShowYou. ఐఫోన్‌లో వీడియోలు బ్రౌజ్‌ చేసి చూసేందుకు ఇదో ప్రత్యేక వారధి. యూట్యూబ్‌,Vimeo, TED... లాంటి ఇతర వీడియో షేరింగ్‌ సర్వీసుల్ని యాక్సెస్‌ చేయవచ్చు. http://goo.gl/tMu9F

Wednesday, 25 September 2013

50gb free Online Storage ని అందించే వెబ్సైట్స్....

50gb వరకు free Online Storage ని అందించే వెబ్సైట్స్ కోసం నెట్ లో వెతుకుతున్నారా?. అయితే, ఈ క్రింది రెండు వెబ్సైట్స్ ని చూడండి.



ఈ సైట్స్ 50gb వరకు free online storage space ని అందించడమే కాకుండా ఎక్కడనుంచైనా మనం store చేసుకున్న files ని access చేసుకునేలా మరియు ఇతరులతో మన files ని secure గా share చేసుకునేలా ఉండేటట్టుగా basic useful features ని కూడా మనకు అందిస్తున్నాయి. So, ఇక ఆలస్యం చేయకుండా ఈ రెండు సైట్స్ లో SignUp అయ్యి Registration పూర్తి చేసుకోని 100gb వరకు (రెండు సైట్లలో కలిపి) free Online Storage space ని పొందే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం పదండి. 

అలాగే, 25gb వరకు free online storage space ని అందించే Microsoft వారి SkyDriveఅవకాశాన్ని కూడా ఉపయోగించుకోని కేవలం ఈ మూడు సైట్ల లో register అవ్వడం ద్వారానే మొత్తంగా 125gb online storage space ని మీ సొంతం చేసుకోండి


Friday, 20 September 2013

తెలివిగా వాడేందుకు తీరైన దారులు!


పీసీ.. ల్యాపీ... నెట్‌బుక్‌... ఏదో ఒకటి ఉండే ఉంటుంది... మరి, ఏదో వాడేస్తున్నాం అంటే సరి కాదు...
కొత్త ఏడాదైనా కాస్త తెలివిగా వాడండి! అందుకు మార్గాలు అనేకం!

ఒకే పంథాలో వాడుతూ వెళితే కొత్త కంప్యూటర్‌ కూడా కుమ్మరి పురుగులానే పని చేస్తుంది. కొత్త ఏడాది అంతా కొత్త కొత్తగా ఉండాలనుకునే దాని విషయంలోనూ పాటించండి. పీసీ సామర్థ్యాన్ని మరింత పెంచడానికి సరికొత్త చిట్కాలు తెలుసుకోవాలి. పనిని సులభం చేసుకోవాలి. కొత్త టూల్స్‌ వాడాలి. అనేక ప్రయోజనాల్ని పొందాలి. అందుకు పైసా ఖర్చు అక్కర్లేదు. ఉచితంగానే అన్నీ అందుబాటులో ఉన్నాయి. అవేంటో కాస్త వివరంగా చూద్దాం!

పవర్‌ అందించండి!
సిస్టంలో ఏదైనా సమస్య వస్తే వెంటనే టెక్నీషియన్‌ని సంప్రదించకుండా అప్లికేషన్‌ రూపంలోనే పీసీని పర్యవేక్షించే సేవకుడిని పెట్టుకోవచ్చు. అదే PowerSuite LITE 2013. ఉచిత వెర్షన్‌ని ఇన్‌స్టాల్‌ చేసుకుని సిస్టం మొత్తాన్ని స్కాన్‌ చేసి లోపాల్ని తెలుసుకోవచ్చు. అందుకు Speed Tools, System Optimization, Disk Optimization విభాగాలున్నాయి. ఫ్రీ వెర్షన్‌లో కొన్ని సౌకర్యాల్ని వాడుకోవచ్చు. http://goo.gl/yzkN5

* ఇలాంటిదే మరోటి SpeedUpMyPc. స్టార్ట్‌అప్‌లో అనవసరంగా రన్‌ అయ్యే ప్రొగ్రాంలను తొలగించొచ్చు. సెట్టింగ్స్‌ని కావాల్సినట్టుగా మార్చుకోవడం ద్వారా సామర్థ్యాన్ని పెంచుకునే వీలుంది. http://goo.gl/i4yNZ

* ప్రపంచ వ్యాప్తంగా 150 మిలియన్ల యూజర్లతో పీసీలను పర్యవేక్షిస్తోంది Advanced SystemCare 6. విండోస్‌ 8, 7 ఓఎస్‌ల్లో కూడా వాడుకోవచ్చు. యాంటీవైరస్‌లా స్పైవేర్‌, యాడ్‌వేర్‌లను తొలగిస్తుంది. http://goo.gl/P7kTq

* ఎప్పటికప్పుడు ఇల్లుని సర్దుకున్నట్టుగానే పీసీ హార్డ్‌డ్రైవ్‌లోని ఫైల్స్‌ని సర్దేయాలంటే Auslogics Disk Defragటూల్‌ని ప్రయత్నించండి. http://goo.gl/7hm3Y

* మీరున్నా లేకపోయినా నిర్ణీత సమయానికి సిస్టం ఆటోమాటిక్‌గా షట్‌డౌన్‌ అయ్యేలా చేయాలంటే Auto Shut Downటూల్‌ని వాడేయండి. ఇన్‌స్టాల్‌ చేశాక ప్రత్యేక విండోలో సమయాన్ని సెట్‌ చేయాలి. http://goo.gl/LXYo4

మురిపించే టూల్స్‌!
కొత్త ఏడాదిలో అన్ని అప్‌డేట్స్‌తో యాంటీవైరస్‌ను వాడుకుని పీసీ సామర్థాన్ని కాపాడుకోవాలంటే AVG Antivirus Free 2013 కి అప్‌డేట్‌ చేయండి. హోం యూజర్లకు ఉచిత వెర్షన్‌ సిద్ధంగా ఉంది. http://goo.gl/7vRlS

* మాల్వేర్‌లను మట్టుపెట్టే మరో రక్షణ వలయంMalwarebytes Anti Malware Free. హోం యూజర్లకు ఇది ప్రత్యేకం. సైట్‌ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకునే వీలుంది. వార్మ్స్‌, ట్రోజన్స్‌, రూట్‌కిట్స్‌, స్పైవేర్‌లు, డైలర్స్‌... లాంటి ప్రమాదకరమైన వైరస్‌లను అడ్డుకుంటుంది. ఆటోమాటిక్‌ అప్‌డేట్స్‌తో ఎప్పటికప్పుడు స్కాన్‌ చేసుకోవచ్చు. గత ఏడాది యాంటీవైరస్‌ డౌన్‌లోడ్స్‌లో మూడో స్థానంలో నిలించింది. http://goo.gl/g0oNU

* 450 మిలియన్ల డౌన్‌లోడ్స్‌తో Ad-Aware Free Antivirusముందుకొచ్చింది. ఇదో యాంటీ స్పైవేర్‌ ప్రొగ్రాం. నెట్‌ యూజర్లకు ఇదో రక్షణవలయం. ఫైల్‌ ఫార్మెట్‌తో సంబంధం లేకుండా నెట్‌ నుంచి చేసే డౌన్‌లోడ్స్‌ని నిత్యం స్కాన్‌ చేస్తూ స్పైవేర్‌లను కట్టడి చేస్తుంది.http://goo.gl/K6ayy

* పబ్లిక్‌ వై-ఫై నెట్‌వర్క్‌లను వాడుతూ నెట్‌లో సంచరిస్తున్నారా? అయితే, మీ నెట్‌కనెక్షన్‌ని భద్రంగా వాడుకోవలంటే Hotspot Shield వాడుకోవాల్సిందే. మొత్తం నెట్‌ ట్రాఫిక్‌ని ఇన్‌క్రిప్ట్‌ చేసి హ్యాకర్ల చేతికి చిక్కకుండా పహారా కాస్తుంది. http://goo.gl/nSxQ2

* ల్యాపీ ఛార్జింగ్‌ని ఎప్పటికప్పుడు మానిటర్‌ చేస్తూ ఛార్జింగ్‌ సమస్య లేకుండా చేయాలంటే? అందుకుBatteryDeley ఉచిత అప్లికేషన్‌ సిద్ధంగా ఉంది. మీరే ఎలర్ట్‌లను సెట్‌ చేసుకోవచ్చు. తరిగిపోతున్న ఛార్జింగ్‌ శాతం ఆధారంగా ఎలర్ట్‌లను సెట్‌ చేయవచ్చు. ఎలర్ట్‌ మెసేజ్‌ల్లో కావాల్సిన ఇమేజ్‌లను పెట్టుకోవచ్చు.http://goo.gl/5AsGS

అవసరం ఏదైనా...
వీడియోలను ప్లే చేయాలంటే విండోస్‌ మీడియా ప్లేయర్‌ ఒక్కటే కాదు. ఇంకా చాలానే ఉన్నాయి. వాటిల్లో GOM Media Player. హై క్వాలిటీతో వీడియోలను చూడొచ్చు. సులువైన ఇంటర్ఫేస్‌తో ప్లేలిస్ట్‌లను క్రియేట్‌ చేసుకుని చూడొచ్చు. http://goo.gl/DpxVN

* ఆన్‌లైన్‌ ఛానల్‌ యూట్యూబ్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసిన వాటిని ఎంపీ3 ఫార్మెట్‌లోకి మార్చుకోవాలంటే? Free Youtube to Mp3 Converter టూల్‌ని ప్రయత్నించండి. http://goo.gl/XCNDM

* నెట్‌ నుంచి ఎక్కువగా వీడియోలు, మ్యూజిక్‌, ఇతర డేటా ఫైల్స్‌ని డౌన్‌లోడ్‌ చేస్తున్నారా? వాటిని సులువైన పద్ధతిలో మేనేజ్‌ చేసుకోవాలంటే? Orbit Downloaderవాడొచ్చు. http://goo.gl/jr1Vy

* ఇంట్లో శుభకార్యాలకు మీరే డీజేగా మారి అలరించాలంటే? Virtual DJ అప్లికేషన్‌తో పీసీని డీజే సిస్టంగా మార్చేయవచ్చు. http://goo.gl/rR4ER

* కుటుంబ సభ్యులు, స్నేహితులతో లైవ్‌ వీడియో ఛాటింగ్‌ చేయాలంటే? Camfrog టూల్‌తో ప్రత్యేక వీడియో ఛాటింగ్‌ రూమ్స్‌ని క్రియేట్‌ చేయవచ్చు. http://goo.gl/oXe6V

* ఫొటోలను వివిధ రకాల టెంప్లెట్‌ డిజైన్లతో ఆకట్టుకునేలా డిజైన్‌ చేసుకోవాలంటే PhotoShine వాడొచ్చు.http://goo.gl/72Y02

* పీడీఎఫ్‌ ఫైల్స్‌ని ఇమేజ్‌ ఫార్మెట్‌లోకి మార్చాలంటే Office Convert PDF to JPG Free ఉంది. http://goo.gl/BMLBE

తప్పక ప్రయత్నించాలి!
మీకు పెయింటింగ్స్‌ వేయడం ఇష్టమా? అయితే, Speedy Painter టూల్‌ని ప్రయత్నించండి. తక్కువ మెమొరీతో 'సీ ప్లస్‌ప్లస్‌' ప్రొగ్రామింగ్‌ ఆధారంగా దీన్ని రూపొందించారు. సులువైన ఇంటర్ఫేస్‌తో బ్రష్‌ సైజుల్ని మార్చుకుని డ్రా చేయవచ్చు. రంగుల్ని మార్చుకునేందుకు కలర్‌ ప్యాలెట్‌ ఉంది. http://goo.gl/Zu2W3

* నెట్‌ వాడుతున్నారా? మీ ఐపీ అడ్రస్‌ని తెలుసుకోవాలంటే? టాస్క్‌బార్‌పై నిత్యం కనిపించేలా పెట్టుకోవాలంటే? సెట్టింగ్స్‌, టెక్నిక్స్‌ ఏం అక్కర్లేదు. Mr.IPటూల్‌ని ప్రయత్నిచండి. ఇన్‌స్టాల్‌ చేయగానే సిస్టం ట్రే పై భాగంలో ఐపీ కనిపిస్తుంది. కావాలంటే మినిమైజ్‌ చేసుకోవచ్చు. http://goo.gl/ZmtPf

* ఫొటోలను ఎడిట్‌ చేయడానికి చాలానే టూల్స్‌ని ఉన్నాయి. Trimto అప్లికేషన్‌ని ప్రయత్నించారా? ఇమేజ్‌ల సైజుని తగ్గించడమే కాకుండా 'షార్పెన్‌ ఎడ్జ్‌, ఆటో కరెక్షన్‌' చేస్తుంది. http://goo.gl/bb3bA

* కావాల్సిన అప్లికేషన్లు, ఫోల్డర్లు, ఫైల్స్‌ని ప్రత్యేక ఇంటర్ఫేస్‌తో ఓపెన్‌ చేయాలంటే MadAppLauncher ని ప్రయత్నించండి. ఒక్కో ట్యాబ్‌లో 30 ప్రొగ్రాంలను పెట్టుకునే వీలుంది. మొత్తం 300 ప్రొగ్రాంలను కాన్ఫిగర్‌ చేయవచ్చు.http://goo.gl/nBVvu