ల్యాపీలు... స్మార్ట్ మొబైళ్లు. వాటిల్లో పాటలు... సినిమాలు. మరి, ఇన్‌బిల్ట్ స్పీకర్లతో వినడం కంటే... బ్లూటూత్ స్పీకర్లు ప్రయత్నించండి! ఎప్పుడైనా.. ఎక్కడైనా... వినడమేకాదు... కాల్స్ మాట్లాడొచ్చు కూడా! వాటి సంగతులేంటో చూద్దాం!
చేతిలో సరిపోతుంది
అన్ని సందర్భాల్లోనూ ఇయర్‌ఫోన్స్ పెట్టుకుని పాటలు వినలేం. అలాంటప్పుడు Bose SoundLink Mini స్పీకర్‌ని వాడొచ్చు. Bass Outputదీంట్లోని ప్రత్యేకత. మ్యూజిక్ ఫార్మెట్ ఏదైనా దీంట్లో ప్లే చేయవచ్చు. బ్లూటూత్ ద్వారా మొబైల్, ల్యాపీ, ఎంపీ3 ప్లేయర్లకు కనెక్ట్ అవుతుంది. స్పీకర్ పై భాగంలో కంట్రోల్ బటన్స్‌ని ఏర్పాటు చేశారు. స్పీకర్‌ని ఒకసారి ఛార్జ్ చేస్తే 6.5 గంటలు పాటు వాడుకోవచ్చు. మూడు గంటల్లో పూర్తిగా ఛార్జ్ అవుతుంది. ఛార్జింగ్ అవుతున్నప్పుడూ పాటలు వినొచ్చు. వివిధ రంగుల్లో స్పీకర్లు అందుబాటులో ఉన్నాయి. ధర సుమారు రూ. 16,200. http://goo.gl/dGbgel
రెండు రకాలుగా...
పాటలు వినడంతో పాటు అనివార్యమైన సందర్భాల్లో ఫోన్ని ఛార్జ్‌చేసే పవర్ బ్యాక్‌అప్ పరికరంగా వాడుకునేందుకు JBL Charge స్పీకర్ ఉంది. ల్యాపీ బ్యాక్‌ప్యాక్‌లో పెట్టుకుని ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. దీంట్లో నిక్షిప్తం చేసిన 6000mAhబ్యాటరీతో స్పీకర్‌ని 10 గంటల పాటు వాడుకోవచ్చు. అంతేకాదు... మొబైల్ ఛార్జింగ్ అయిపోతే యూఎస్‌బీ ద్వారా స్పీకర్‌కి కనెక్ట్ చేసి ఛార్జ్ చేయవచ్చు. ధర సుమారు రూ. 9,990.http://goo.gl/O0UJRS
కాల్స్ కూడా...
పోర్టబుల్ సైజుతో హ్యాండ్ బ్యాగ్‌లో ఇమిడిపోతుంది. స్పీకర్ పేరు Creative Airwave. పాటల్ని ప్లే చేయడంతో పాటు మీకొచ్చే కాల్స్‌ని కూడా వినిపిస్తుంది. అందుకు అనువుగా ఇన్‌బిల్ట్ మైక్‌ని ఏర్పాటు చేశారు. దీంతో మీరు ఫోన్‌కాల్స్ మాట్లాడొచ్చు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే సుమారు 10 నుంచి 10.5 గంటలు పాటలు వినొచ్చు. బూట్లూత్ ద్వారా ఫోన్, ట్యాబ్, ల్యాపీలను కనెక్ట్ చేసి వాడుకోవచ్చు. ధర సుమారు రూ.6,999. http://goo.gl/Gd2Qya
ఒకదానితో ఒకటి
స్టీరీయో సౌండ్ సిస్టంతో పాటలు వినేందుకు అనువైందిHDMX Jam Plus. రెండు స్పీకర్లు ఒకదానితో మరోటి కనెక్ట్ అయ్యి 'కుడి, ఎడమ ఆడియో ఛానల్స్'ని ప్లే చేస్తాయి.BassOutputఆకట్టుకుంటుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే నాలుగు గంటల పాటు వాడుకోవచ్చు. బ్లూటూత్ ద్వారా మొబైల్, ట్యాబ్, ల్యాపీలకు అనుసంధానం చేయవచ్చు. ఒక్కో స్పీకర్ ధర రూ.3,990. http://goo.gl/agDQVT
మరింత నాణ్యత
కారులో వెళ్తున్నప్పుడో... స్నేహితులతో పార్టీ చేసుకునేప్పుడో... మీకు ఇష్టమైన పాటల్ని వినాలంటేJabra Solemate స్పీకర్‌ని వాడొచ్చు. డ్రైవింగ్‌లో ఉన్నప్పుడు మీకు వచ్చే కాల్స్‌ని మాట్లాడేందుకు స్పీకర్‌లో ఇన్‌బిల్ట్ మైక్ కూడా ఉంది. Bass Output పూర్తి స్థాయిలో వినిపిస్తుంది. ఒకవేళ మీరు వాడుతున్న ఫోన్, ల్యాపీ, ట్యాబ్లెట్‌కి బ్లూటూత్ సదుపాయం లేకపోతే 3.5 ఎంఎం పిన్ ద్వారా స్పీకర్‌ని కనెక్ట్ చేయవచ్చు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే టాక్‌టైం 10 గంటలు. పాటలు మాత్రం 8 గంటల పాటు వినొచ్చు. బ్యాటరీ స్టేటస్‌ని తెలుసుకునేందుకు ఇండికేటర్ ఉంది. ధర రూ.10,990. http://goo.gl/dVJ9CR
కొంచెం స్త్టెల్‌గా...
కాస్త ఆధునిక రూపంతో ఆకట్టుకునేలా బ్లూటూత్ స్పీకర్‌ని వాడుకోవాలనుకుంటే F&D M8 పోర్టబుల్ స్పీకర్ గురించి తెలుసుకోవాల్సిందే. బ్లూటూత్ ద్వారా స్పీకర్‌కి కనెక్ట్ అయ్యి 10 మీటర్ల పరిధిలో పాటలు వినొచ్చు. ఫోన్‌కాల్స్ కూడా మాట్లాడొచ్చు. స్పీకర్‌ని తీసుకెళ్లడానికి అనువుగా 'పౌచ్' ఉంది. యూస్‌బీ కేబుల్ ద్వారా ఛార్జ్ చేయవచ్చు. 3.5 ఎంఎం జాక్ ద్వారా కూడా స్పీకర్‌ని కనెక్ట్ చేయవచ్చు. ధర రూ.1,599. http://goo.gl/xQMWfq
చిన్నదే కానీ...
పరిమాణం చిన్నదేగానీ... పలికే సౌండ్ మాత్రం అదరాల్సిందే. అదే సోనీ కంపెనీ తయారు చేసిన SRS-BTV5 స్పీకర్. 'క్రిస్టల్ క్లియర్ సౌండ్'తో పాటలు వినొచ్చు. అంతేకాదు... ఇన్‌బిల్ట్‌గా ఏర్పాటు చేసిన 'స్పీకర్‌ఫోన్ బటన్'పై క్లిక్ చేసి ఎప్పుడైనా ఫోన్ కాల్స్ మాట్లాడే వీలుంది. 360 degree Circle Sound టెక్నాలజీతో స్పీకర్ అన్ని వైపులా మ్యూజిక్ వినిపిస్తుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 5 గంటల పాటు మ్యూజిక్ వినొచ్చు. వినేటప్పుడే యూఎస్‌బీ కేబుల్ ద్వారా స్పీకర్‌ని ఛార్జ్ చేయవచ్చు.http://goo.gl/lFmbxa
'లాగీటెక్' కూడా...
పీసీ పరికరాల తయారీ కంపెనీ లాగీటెక్ కూడా Logitech UE BOOMBOX స్పీకర్‌ని అందిస్తున్నారు. స్పీకర్‌కి రెండు వైపులా కంట్రోల్ బటన్స్‌ని ఏర్పాటు చేశారు. 6 గంటలు పాటలు వినొచ్చు. ధర రూ.16,499.





Not only for YouTube, the software works well with more then 165 video sites like Yahoo Video, Facebook, Aol Video, Myspace, ESPN, and many more . You just need to install the software and it will take care of the rest. The free version works with all the normal videos but for accelerating HD (High Definition) videos you need to upgrade to premium version.