స్మార్ట్ మొబైల్ చేతిలో ఉంటే...
ఆప్స్, అంతర్జాలమే కాదు...
ఈ-పుస్తకం కూడా చేతిలో ఉన్నట్టే!
పుస్తక ఫార్మెట్ ఏదైనా...
చక్కగా ఫోన్‌లోనే చదువుకోవచ్చు!
అందుకు తగిన ఆప్స్ సిద్ధం!
అంతా అంతర్జాలంలోనే. దిన పత్రికల దగ్గర్నుంచి అన్నీ డిజిటల్ ఫార్మెట్‌లోకి మారిపోతున్నాయి. పుస్తకాల గురించైతే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటికే అన్ని ఆన్‌లైన్ గ్రంథాలయాల్లో సందడి చేస్తున్నాయి. మరి, ఈ-పుస్తకాల్ని చదవాలంటే ఈ-బుక్ రీడర్లే అవసరం లేదు. వాటిని కొనలేకపోతే ఫోన్నే ఈ-బుక్ రీడర్‌గా మార్చేయవచ్చు. ఆయా ఆప్స్‌ని ఉచితంగా ఇన్‌స్టాల్ చేసుకుని మొబైల్‌ని మిని లైబ్రరీగా మార్చేయవచ్చు. అంతర్జాలంలోని ఆయా మొబైల్ ఆన్‌లైన్ స్థావరాల నుంచీ పుస్తకాల్ని ఉచితంగా పొందొచ్చు. గూగుల్ ఈ-బుక్స్, ఐఓఎస్ ఐబుక్స్ వేదికలే అందుకు ఉదాహరణ. ఇక పబ్లిక్ డొమైన్స్‌లోనూ ఈ-పుస్తకాలు అనేకం. PDF, ePub, Mobi... ఫార్మెట్‌ల్లో కనిపించే ఆయా పుస్తకాల్ని మొబైల్‌లోకి కాపీ చేసుకుని ఈ-బుక్ ఆప్స్‌తో చదువుకోవచ్చు. మరి, వాటి సంగతులేంటో వివరంగా తెలుసుకుందాం!
ఆండ్రాయిడ్ వాడితే...
మునివేళ్లపై పేజీలు తిప్పుతూ పుస్తకాలు చదువుకునేలా Aldiko Book Reader ఆప్‌ని వాడుకోవచ్చు. ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫామ్‌పై రన్ అయ్యే ఈ-బుక్ అప్లికేషన్‌ను గూగుల్ ప్లే నుంచి ఉచితంగా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. 200 దేశాల్లో 15 మిలియన్ల యూజర్లు వాడుతున్నారు. ఉచితం, ప్రీమియం వెర్షన్లలో అందుబాటులో ఉంది. epub, PDF ఫార్మెట్స్‌ని ఇది సోపర్ట్ చేస్తుంది. ఎంపిక చేసుకున్న పుస్తకాల్ని 'సెల్ఫ్'లో చూపిస్తుంది. పబ్లిక్ లైబ్రరీల నుంచి డౌన్‌లోడ్ చేసుకున్న ఈ-పుస్తకాల్ని సపోర్ట్ చేస్తుంది. పుస్తకాల్ని చదివేందుకు అనువుగా మార్పులు చేయవచ్చు. ఫాంట్ సైజుని పెంచుకునే వీలుంది. 'ఫాంట్ టైప్'ని కూడా మీరే ఎంపిక చేసుకోవచ్చు. పుస్తకంలోని బ్యాక్‌గ్రౌండ్ కలర్, మార్జిన్స్, ఎలైన్‌మెంట్స్, లైన్ స్పేస్‌లను చదివేందుకు అనువుగా మార్పులు చేయవచ్చు. కళ్లకు ఒత్తిడి లేకుండా పుస్తకం 'బ్రైట్‌నెస్'ని మార్పుకునే వీలుంది. రాత్రి సమయంలో పుస్తకాల్ని చదవాల్సివస్తే 'నైట్ టైం రీడింగ్' మోడ్‌ని సెలెక్ట్ చేయవచ్చు. ఫోన్స్, ట్యాబ్లెట్‌లోనూ ఆప్‌ని వాడుకోవచ్చు. పుస్తకాన్ని చదివేప్పుడు 'బుక్‌మార్క్'లను పెట్టుకునే వీలుంది. మొత్తం పుస్తకాల్ని టాగ్స్ ద్వారా ఆర్గనైజ్ చేయవచ్చు. పుస్తకాన్ని సెలెక్ట్ చేయగానే ఆటోమాటిక్‌గా చదువుతున్న పేజీలోకి తీసుకెళ్తుంది. ఎక్కువ సమయం ఈ-పుస్తకాల్ని చదువుతున్నట్లయితే బ్యాక్‌గ్రౌండ్‌ని నలుపు రంగులో సెట్ చేసుకుని టెక్స్ట్ రంగుని తెలుపుగా మార్చుకుంటే మంచిది. అప్ కావాలంటే http://goo.gl/FRj3h8 లింక్ నుంచి పొందొచ్చు.
* ఇలాంటిదే మరోటి Mantano Ebook Reader Lite. సులువైన ఇంటర్ఫేస్‌తో ఈ-పుస్తకాల్ని చదువుకునేలా ఆప్‌ని రూపొందించారు. http://goo.gl/Vkfl55.
* మరో పుస్తకాల స్థావరం Free Books & Stories- Wattpad.సుమారు 20 మిలియన్ల ఉచిత ఈ-పుస్తకాల్ని అందిస్తోంది. ఇదో పుస్తక ప్రియుల నెట్‌వర్క్. ఆప్‌లో లాగిన్ అయితే కావాల్సిన పుస్తకాలతో పెద్ద గ్రంథాలయాన్నే ఏర్పాటు చేయవచ్చు. నచ్చిన పుస్తకాలపై రివ్యూలు రాసి ఇతరులతో పంచుకోవచ్చు. నెట్‌వర్క్ సభ్యులతో ఛాట్ చేయవచ్చు. http://goo.gl/5U7Wic
* వివిధ రకాల ఫార్మెట్‌లతో కూడిన ఈ-బుక్స్‌ని చదివేందుకు AlReader-any type book Reader ఆప్‌ని వాడొచ్చు.http://goo.gl/QewFyP
బ్లాక్‌బెర్రీలోనూ...
క్వర్టీ కీబోర్డ్‌తోనే కాకుండా తాకే తెరతోనూ బ్లాక్‌బెర్రీ తన ప్రత్యేకతను చాటుకుంటోంది. బ్లాక్‌బెర్రీ ఆప్‌వరల్డ్‌తో అనేక ఆప్స్‌ని కూడా అందిస్తోంది. ఇప్పుడు ఫోన్ని ఈ-బుక్‌లా మార్చేసేలా PlayEpub Book Reader ఆప్‌ని అందిస్తోంది. ePub, Mobi, PDF ఫార్మెట్‌లను సపోర్ట్ చేస్తుంది. Portrait, Landscapeమోడ్స్‌లో ఆప్‌ని వాడుకోవచ్చు. ఆప్ రన్ చేయగానే ఫైల్ బ్రౌజర్‌లా కనిపిస్తుంది. అక్కడ కనిపించే పుస్తకాల్లో చదవాల్సిన పుస్తకంపై క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. చదువుకునేందుకు అనువుగా ఫాంట్, సైజు, లైన్ స్పేస్... అన్నింటినీ మార్పులు చేయవచ్చు. Day, Night మోడ్స్‌తో మరింత అనువుగా చదువుకోవచ్చు. పేజీల్లోని టెక్స్ట్ మేటర్‌ని 'హైలైట్' చేసుకునే వీలుంది. క్లిష్టమైన పదాలకు 'డిక్షనరీ' ఆప్షన్ ద్వారా అర్థాన్ని తెలుసుకునే వీలుంది. జిప్ ఫార్మెట్‌లో డౌన్‌లోడ్ చేసుకున్న పుస్తకాల్ని 'అన్‌జిప్' చేయవచ్చు. బుక్ కావాల్సిన మేటర్‌ని సెర్చ్ ద్వారా వెతకొచ్చు.http://goo.gl/JuLrZV
ఐఓఎస్ అయితే...
యాపిల్ స్థావరాలు అనేకం. వాటిల్లో పుస్తకాల స్థావరం కూడా ఒకటి ఉంది. అదే iBooks.ఐఫోన్ యూజర్లు ఉచితంగా ఈ-రీడర్ ఆప్‌ని వాడుకోవచ్చు. ఆప్‌ని నిక్షిప్తం చేసుకున్నాక ఐబుక్స్ స్టోర్ నుంచి కావాల్సిన పుస్తకాన్ని డౌన్‌లోడ్ చేసుకుని చదవొచ్చు. ఆప్‌లోని ఏడు రకాల ఫాంట్ స్త్టెల్స్‌లో కావాల్సిన స్త్టెల్‌ని ఎంపిక చేసుకోవచ్చు. మూడు రకాల పేజీ లేఅవుట్స్ ఉన్నాయి. పేజీ బ్యాక్‌గ్రౌండ్ రంగులు కూడా మూడే. పుస్తకంలో మీకు నచ్చిన టెక్స్ట్ మేటర్‌ని 'హైలైట్' చేసుకునే వీలుంది. అలాగే, పేజీలకు 'నోట్స్' కూడా రాసుకోవచ్చు. నచ్చిన పుస్తకానికి సంబంధించిన విశేషాల్ని ఫేస్‌బుక్, ట్విట్టర్‌లో పోస్టింగ్‌లు చేసే వీలుంది. ఇన్‌బిల్ట్ సెర్చ్ ద్వారా పుస్తకంలోని పదాలు, వాక్యాల్ని వెతికే వీలుంది. 'స్క్రీన్ బ్రైట్‌నెస్'ని కావాల్సినట్టుగా సెట్ చేసుకోవచ్చు. ముఖ్యమైన పుస్తకాల్ని, వాటికి సంబంధించిన నోట్స్‌ని 'ఐక్లౌడ్'లోకి అప్‌లోడ్ చేసుకోవచ్చు. 'ఎయిర్‌ప్రింట్' ద్వారా పుస్తకాలపై రాసుకున్న నోట్స్‌ని ప్రింట్ తీసుకునే వీలుంది. పబ్లిక్ లైబ్రరీల నుంచి డౌన్‌లోడ్ చేసుకున్నePub, PDF ఫార్మెట్ పుస్తకాల్ని సపోర్ట్ చేస్తుంది. 18 భాషల పుస్తకాల్ని చదువుకోవచ్చు. పుస్తకాల్ని ఐపాడ్, ఐప్యాడ్‌లోనూ సింక్రనైజ్ చేసుకుని చదువుకోవచ్చు.http://goo.gl/tH9qsx
పెద్ద అడ్డా...
ఆండ్రాయిడ్ యూజర్లకు గూగుల్ ప్లే స్టోర్‌లో మరో పుస్తక స్థావరం ఉంది. అదే Books. కావాలంటేhttps://play.google.com/store/booksలింక్‌లోకి వెళ్లి పొందొచ్చు. స్టోర్‌లో ఉచిత విభాగం కూడా ఉంది. హోం పేజీలోని మెనూలోకి వెళ్లి రంగాల వారీగా పుస్తకాల్ని బ్రౌజ్ చేయవచ్చు. కొత్తగా మార్కెట్‌లోకి వచ్చిన పుస్తకాల్నిNew Arrivals విభాగంలో చూడొచ్చు. ఎక్కువ ఆదరణ పొందిన ఉచిత ఈ-పుస్తకాల్ని Top Free in books మెనూలోకి వెళ్లాలి. మీరు నిక్షిప్తం చేసుకున్న మొత్తం ఈ-బుక్స్ జాబితాని My books మెనూలో చూడొచ్చు.
ఇక్కడ ఈ-పత్రికలు
ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులో ఉన్న వార, మాస పత్రికల్ని మొబైల్‌లోనూ చూడాలంటే? అందుకో ఆప్ సిద్ధంగా ఉంది. అదే Zinio. ఆండ్రాయిడ్ యూజర్లు గూగుల్ ప్లే నుంచి ఉచితంగా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. దీంట్లోని డిజిటల్ మ్యాగజైన్స్ 5000లకు పైమాటే. థంబ్‌నెయిల్ ఐకాన్స్‌లో పత్రికలు కనిపిస్తాయి. రంగాల వారీగా వీటిని పొందుపరిచారు. పత్రికల్ని ఫోన్‌లోకి సింక్ చేసుకున్నాక గ్రంథాలయంగా ఏర్పాటు చేసుకుని ఆఫ్‌లైన్‌లోనూ చదువుకోవచ్చు. కొత్త పత్రికల వివరాల్ని నోటిఫికేషన్స్ ద్వారా పొందొచ్చు.http://goo.gl/ZoRmmz
* ఐఫోన్ యూజర్లు http://goo.gl/PZ75Sm లింక్ నుంచి పొందొచ్చు.
* బ్లాక్‌బెర్రీ మొబైల్ వాడుతున్నట్లయితే 'బ్లాక్‌బెర్రీ వరల్డ్' నుంచి ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఇదిగో లింక్http://goo.gl/Olo7Ll
పుస్తక స్థావరాలు
*http://books.google.co.in/books
సెర్చింజన్ దిగ్గజం గూగుల్ అందించే ఈ-పుస్తకాల స్థావరం. ఉచిత పుస్తకాల్ని సిస్టం నుంచి కూడా చదువుకునే వీలుంది.
*www.gutenberg.org
ఇదో ఉచిత పుస్తకాల స్థావరం. సుమారు 42,000 ఈ-పుస్తకాల్ని డేటాబేస్‌లో నిక్షిప్తం చేశారు. కావాల్సిన పుస్తకాల్ని వెతికి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఎలాంటి సభ్యత్వం అక్కర్లేదు. మీరూ పుస్తకాల్ని డొనేట్ చేయవచ్చు.
*http://manybooks.net
దీన్ని పబ్లిక్ ల్రైబ్రరీగా చెప్పుకోవచ్చు. పేరొందిన పుస్తకాల్ని బ్రౌజ్ చేసుకుని పొందొచ్చు. ఎక్కువ ఆదరణ పొందిన పుస్తకాల్ని Papular Downloads మెనూలో చూడొచ్చు.
*www.booksinmyphone.com
స్మార్ట్ మొబైళ్లలోనే కాకుండా జావా ఎనేబుల్డ్ మొబైల్స్‌లోనూ బుక్స్‌ని డౌన్‌లోడ్ చేసుకుని చదువుకోవచ్చు. 'బ్రౌజ్ బుక్స్' మెనూలోకి వెళ్లి డేటాబేస్‌లోని పుస్తకాల్ని చూడొచ్చు. చదివేందుకు అనువుగా 'బుక్ సెట్టింగ్స్'ని మార్చుకునే వీలుంది.
*www.planetbook.com
నాణ్యతతో కూడిన పుస్తకాల్ని ఉచితంగా అందిస్తున్నారు. సాహితీ ప్రియులకు ఇదో చక్కని పుస్తక వేదిక.
*www.turnit.com
ఇదో పత్రికల స్థావరం. పేరొందిన అన్ని వార, మాస పత్రికల్ని ఇక్కడ పొందొచ్చు. ఉచిత విభాగంలోకి వెళ్లి అధికారికంగా పత్రికల్ని యాక్సెస్ చేయవచ్చు. డౌన్‌లోడ్ చేసుకోవాలంటే సైట్‌లో సభ్యులవ్వాల్సిందే.
*http://free.yudu.com
ఉచితంగా పుస్తకాల్ని నిక్షిప్తం చేసుకోవడం మాత్రమే కాకుండా మీరూ ఏదైనా పత్రికని ప్రారంభించొచ్చు. ఉచితంగా ఆన్‌లైన్ పబ్లిషింగ్ చేసేందుకు చక్కని వారధి.
0 comments:
Post a Comment