ఏదైనా నేర్చుకోవాలంటే? తరగతి గదులు... పెద్దలు... పుస్తకాలు... సెమినార్‌లు... లాంటివి ఒకప్పటి వేదికలు. మరిప్పుడు ఒక్కటే వేదిక. అదేంటో ఎవ్వరిని అడిగినా టక్కున చెప్పేస్తారు ఇంటర్నెట్ అని. మీరు విద్యార్థులైనా... ఉద్యోగులైనా... గృహిణులైనా... నేర్చుకోవాలనే ఆసక్తి ఉండాలేగానీ నెట్టింట్లో వేదికలు అనేకం ఉన్నాయి. అంతా ఉచితమే. కావాల్సిందల్లా నెట్ వాడకంపై కాస్త పరిజ్ఞానం. ఇక మిమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు. అవేంటో కాస్త వివరంగా తెలుసుకుందాం!
ఫొటోగ్రఫీ కోసం...
కొత్త డిజిటల్ కెమెరా కొన్నాక ఏం చేస్తాం? ఎలా వాడాలి.. ఫొటోలు ఎలా క్యాప్చర్ చేయాలి... కెమెరాలో ఉన్న ఇన్‌బిల్ట్ ఫీచర్స్‌ని వాడడం ఎలా? లాంటి విషయాలపై శ్రద్ధ పెడుతుంటాం. అందుకోసం టుటోరియల్స్‌ని వెతుకుతుంటాం. అలాంటి వారికిhttp://photographycourse.netప్రత్యేకం. ప్రారంభ కోర్సుల దగ్గర్నుంచి ఫ్రొఫెషనల్ ఫొటోగ్రఫీ వరకూ చిట్కాల్ని తెలుసుకోవచ్చు. విభాగాల వారీగా విశేషాల్ని అందిస్తున్నారు. ఉదాహరణకు ఫొటో ఎడిటింగ్ గురించి తెలుసుకోవాలంటే Photo Editing మెనూలోకి వెళ్లాలి.
*ఇలాంటిదే మరోటి www.expertphotogra phy.com ఉచితం ఈ-పుస్తకాన్ని ఉచితంగా పొందొచ్చు. నిపుణుల రివ్యూల నుంచి చిట్కాల్ని నేర్చుకోవచ్చు.
*http://photo.net/learn/లింక్‌లోకి వెళ్లి ఫొటోగ్రఫీ విశేషాల్ని తెలుసుకోవచ్చు. వ్యాసాలు, టుటోరియల్స్ ఉన్నాయి. పెళ్లి వేడుకలో తీయాల్సిన ఫొటోలకు ప్రత్యేక విభాగం ఉంది. వ్యాసాల్లో ఎక్కువ శాతం ఆ రంగంలోని నిపుణులు రాసినవే.
*ఫొటోగ్రఫీకి సంబంధించిన రివ్యూలకుwww.dpreview.com/glossaryలింక్‌లోకి వెళ్లండి. కెమెరా సిస్టం, డిజిటల్ ఇమేజింగ్, ఆప్టికల్, స్టోరేజ్ అంశాలపై వ్యాసాల్ని చూడొచ్చు.
* ఆప్స్‌ని మొబైల్‌లో ఇన్‌స్టాల్ చేసుకుని కూడా ఫొటోగ్రఫీ విశేషాల్ని తెలుసుకోవచ్చు. అందుకు ఆండ్రాయిడ్ యూజర్లు Photography Tutorials ఆప్‌ని నిక్షిప్తం చేసుకోవచ్చు. సుమారు 2000 టుటోరియల్స్ ఉన్నాయి. http://goo.gl/QFWwoC
*యాపిల్ యూజర్లు ఐట్యూన్స్ నుంచి నిక్షిప్తం చేసుకోవచ్చు. http://goo.gl/m7rnlv
కంప్యూటర్ పాఠాలు
కంప్యూటర్ కోర్సుల కోసం ఇన్‌స్టిట్యూట్స్‌లో కుస్తీలు పడుతుంటారు. ఏదైనా సందేహం వస్తే నెట్‌లో అందుబాటులో ఉన్న క్లాస్‌రూంలోకి చొరబడతారు. జావాస్క్రిప్ట్, పీహెచ్‌పీ, పైథాన్, రూబీ... చెప్పాలంటే ఇలాంటి కోర్సుల్ని దాటించే ఆన్‌లైన్ అడ్డాలు చాలానే ఉన్నాయి. కావాలంటే www.codeacade my.com సైట్‌లోకి వెళ్లండి. మీరే కోడింగ్ చేసి సైట్‌ని డిజైన్ చేయవచ్చు. విభాగాల వారీగా లాంగ్వేజ్‌లను చూడొచ్చు. JavaScript, JQuery, PHP, Python, Ruby Web Projects, APIs విభాగాలు ఉన్నాయి. దీంట్లో సాధన చేసేందుకు సభ్యులవ్వక్కర్లేదు. సైట్‌ని 'ఫుల్‌స్క్రీన్' మోడ్‌లో సెట్ చేసుకునే వీలుంది. సభ్యులైతే ఎప్పటికప్పుడు ఆప్‌డేట్ అయ్యే వీలుంది.
* ప్రత్యేకంగా Rubyపాఠాల్ని అభ్యసించేందుకుhttp://rubylearning.com ఉంది.
* జావా, పైతాన్, రూబీ కోర్సులకు ప్రత్యేక 'వీధి' సిద్ధంగా ఉంది. అందులో జాయిన్ అవ్వాలంటేwww.learnstreet.comలో సభ్యులైపోండి.
* అన్ని రకాల కోర్సులకు అడ్డాగాhttp://net.tutsplus.comవెబ్ సర్వీసుని చెప్పుకోవచ్చు.
* ఇలాంటివి మరికొన్ని... www.w3schools.com, www.codeh s.com, www.hac kety.com
* ఐప్యాడ్ వాడుతున్నట్లయితే Treehouseఆప్‌ని నిక్షిప్తం చేసుకుని C, HTML, CSS, Java, PHP, Ruby...లాంటి కోర్సుల్ని సాధన చేయవచ్చు. http://goo.gl/fc6lAj
* మీరు వాడుతున్న ఆండ్రాయిడ్‌లోనే జావాస్క్రిప్ట్ రిఫరెన్స్ కావాలంటే JavaScript Ref ఆప్‌ని ఇన్‌స్టాల్ చేసుకోండి. http://goo.gl/Xo EEJO
భాష ఏదైనా...
అవసరం మేరకో... అలవాటుగానో... కొత్త భాషల్ని నేర్చుకోవాలంటే? ఇన్‌స్టిట్యూట్‌లను సంప్రదించడం మామూలే. నెట్‌లోనూ చాలానే 'స్పోకెన్ లాంగ్వేజీ' వెబ్ సర్వీసులు ఉన్నాయి. వీడియోలు, టెక్ట్స్ మెటీరియల్‌రూపంలో భోదన చేస్తున్నారు. కావాలంటేwww.talkenglish.comసైట్‌లోకి వెళ్లండి. విభాగాల వారీగా పాఠ్యాంశాల్ని పొందుపరిచారు. వాక్యాల్ని వింటూ చదవొచ్చు.
* ఇలాంటివి మరికొన్ని... www.spokenenglish.org, www.englishbanana.com,www.englishleap.com,http://freeenglishnow.comవీటిలో కొన్ని సైట్స్ నుంచి మెటీరియల్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సాధన చేసేందుకు వర్క్‌షీట్‌లు కూడా ఉన్నాయి.క్విజ్‌ల్లో పాల్గొనొచ్చు.
* ఒకవేళ ఇంగ్లిష్‌తో పాటు ఇతర భాషల్ని నేర్చుకోవాలనుకుంటే www.linguanaut.com, www.openculture.comసైట్స్‌లోకి వెళ్లండి.
* మీ మొబైల్, ట్యాబ్స్‌లోనూ భాషల్ని మెరుగు పరుచుకోవాలంటే ఆండ్రాయిడ్ యూజర్లు Duolingoఆప్‌ని పొందండి. సులువైన ఇంటర్ఫేస్‌తో సాధన చేయవచ్చు.http://goo.gl/yUtWtr
* యాపిల్ యూజర్లు ఐట్యూన్స్ నుంచి ఉచితంగా నిక్షిప్తం చేసుకోవచ్చు. http://goo.gl/Q4PB1w
* లాంగ్వేజీ కమ్యూనిటీల్లో చేరేందుకు http://livemocha.com,http://lang-8.comఉన్నాయి.
డ్రాయింగ్ అడ్డాలు!
కుంచె చేతబట్టి మరో పికాసోలా మారాలనేది మీ లక్ష్యం అయితే ఆర్ట్‌ని సాన పెట్టుకునేందుకు ఆన్‌లైన్‌లో అనేక అడ్డాలున్నాయి. అందుకు ఉదాహరణేwww.artfactory.comవెబ్ సైట్. నిపుణులైన కళాకారుల శైలి, చిట్కాల్ని నేర్చుకోవచ్చు. గ్యాలరీలో ఆకట్టుకునే కళాత్మక చిత్రాల్ని చూడొచ్చు.
* ట్యుటోరియల్స్, వ్యాసాలు, టిప్స్‌తో ఆర్ట్‌ని మెరుగు పరుచుకునేందుకు http://thevirtualinstructor.com లోకి వెళ్లొచ్చు. వీడియోలు కూడా ఉన్నాయి.
* క్రియేటివ్‌గా 'క్రాఫ్ట్'లను రూపొందించేందుకుwww.instructables.comసైట్‌లోకి వెళ్లండి. సెర్చ్‌తో కావాల్సిన వాటిని వెతకొచ్చు. మీరు రూపొందించిన వాటిని కమ్యూనిటీతో పంచుకునే వీలుంది.
* చేతిలోనే మొబైల్‌నివాడుకునే డ్రాయింగ్ చేద్దాం అనుకుంటే How to Draw అప్‌ని వాడొచ్చు. మొబైల్‌లో ఒక్కో స్టెప్పు చూస్తూ గీయవచ్చు. వీడియో, ఇతర వివరాలకుhttp://goo.gl/qQeVg9
* ఐఫోన్ యూజర్లు http://goo.gl/rjksepలింక్‌లోకి వెళ్లండి.
* మరిన్ని డ్రాయింగ్ ఆప్స్‌కి ఆండ్రాయిడ్ యూజర్లుhttp://goo.gl/0fySeJలింక్‌ని చూడండి.
ఇక డ్యాన్స్!
అదిరేలా స్టెప్పులు వేయాలన్నా నెట్టింట్లోకి అడుగెట్టాల్సిందే. అందుకు యూట్యూబ్‌లో అనేక వీడియో టుటోరియల్స్ సిద్ధంగా ఉన్నాయి. అందుకు కీవర్డ్‌తో సెర్చ్ చేస్తే సరి. బాలీవుడ్ డ్యాన్స్ స్టెప్పులకు 'మై బాలీవుడ్ స్టుడియో' ఛానల్‌లో వీడియో పాఠాలు సిద్ధంగా ఉన్నాయి. చూస్తూ మీరూ డ్యాన్స్‌ని మెరుగు పరుచుకోవచ్చు. http://goo.gl/rZ6lMQ
* ఇంకా చెప్పాలంటే www.dancetothis.com వెబ్ సర్వీసులోకి వెళ్లొచ్చు. విభాగాల వారీగా వీడియోలను నిక్షిప్తం చేశారు. hip hop, pop, street, break dance...లాంటివి చాలానే ఉన్నాయి.
* మరో డాన్స్ వేదిక కావాలనుకుంటే http://goo.gl/8Op2Cmలింక్‌లోకి వెళ్లండి. వీడియోలను వీక్షించేందుకు హోం పేజీలోని లింక్స్‌పై క్లిక్ చేయండి.
* అలాగే, www.idance.netమరోటి. వీడియోలను ఎక్స్‌ప్లోర్ చేసి చూడొచ్చు.
* ఆండ్రాయిడ్ యూజర్లు మొబైల్ ద్వారా డ్యాన్స్ నేర్చుకునేందుకు http://go o.gl/LMZnAW లింక్‌లోకి వెళ్లండి.
పాకశాల సర్వీసులు
ఇంట్లో మీ అమ్మ వంట నేర్పలేదా? అనే అవకాశాన్ని ఇవ్వకుండా భార్యామణులు నెట్టింట్లో వంటకాల్ని వంటింట్లో చేసేస్తుంటే... బ్రహ్మచారులేమైనా తక్కువ తిన్నారా? ఎల్‌సీడీ తెరలపై చూస్తూ నాన్‌స్టిక్‌పై రుచుల్ని ఆరగించేస్తున్నారు. కావాలంటే ఈ సైట్‌లు చూడండి...www.indianfoodforever.comదీంట్లో మెనూల వారీగా అన్ని రకాల వంటల్ని చూడొచ్చు. ఆంధ్రా వంటకాలకు ప్రత్యేక మెనూ ఉంది.
* ఇంకాస్త కలర్‌ఫుల్‌గా వంటలు చేయాలంటేwww.sailusfood.com సైట్‌లోకి వెళ్లండి. పండుగలకు చేసుకునే వంటలకు ప్రత్యేక మెనూ ఉంది.
* మరో వంటల వేదిక www.vahrehvah.com.వీడియోలు చూస్తూ వంటను పూర్తి చేయవచ్చు. వంటల్లోని రకాలకు మెనూలు బ్రౌజ్ చేయండి. వంటల్లో సందేహాలకు సైట్ నిర్వాహకుల్ని అడగొచ్చు.
*మరిన్ని స్పెషల్ వంటకాలకు www.tarladalal.com, http://sify.com, www.sanjeevkapoor.com, www.manjulakichen, http://anjalipathak.comసైట్‌లను చూడొచ్చు.
*ఇంగ్లిష్ పదాల్ని ఎలా పలకాలో తెలుసుకోవాలంటేwww.soundsofenglish.orgసైట్‌లోకి వెళ్లండి.
*వీడియో క్లాస్‌లతో ఆంగ్లాన్ని అభ్యసించేందుకు Lets Talk Institute ఛానల్‌ని చూడండి. http://goo.gl/ogW0DG
మరికొన్ని...
* www.wikihow.com
అంశం ఏదైనా నేర్చుకునేందుకు అనేక వ్యాసాలు ఉన్నాయి. సభ్యులై మీరూ రాయొచ్చు.
* www.ehow.com
సందేహం ఏదైనా సమధానాల్ని అందిస్తుంది.
* www.hackaday.com
మెదడుకి మరింత పదును పెట్టేందుకు ప్రత్యేక వేదిక.
* www.makezine.com
క్రియేటివ్ వర్క్స్, విశేషాల్ని అందించే అడ్డా.
* www.makeuseof.com
వివిధ సైట్‌ల్లోని టెక్ అప్‌డేట్స్‌ని ఎప్పటికప్పుడు అందిస్తుంది.
* www.howcast.com
వీడియో టుటోరియల్స్ ఆధారంగా అన్నీ నేర్చుకోవచ్చు.
* www.videojug.com
ఇదో వీడియోల స్థావరం. కావాల్సిన అంశాన్ని సెర్చ్ చేసుకుని చూడొచ్చు.
0 comments:
Post a Comment