వాడేది స్మార్ట్ మొబైలా? 3జీ నెట్‌వర్క్ ఉంటే చాలు... వీడియో కాలింగ్‌కి వేదికలెన్నో!
మార్కెట్‌లోని స్మార్ట్ మొబైళ్లలో ఎక్కువ శాతం డ్యుయల్ కెమెరాలే. వీడియో కాలింగ్‌కి అనువుగా ఒక కెమెరాని వాడుకోవచ్చు. ఇక ఆప్ అడ్డాల్లో వీడియో కాలింగ్‌కి అనువైన అప్లికేషన్ల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నచ్చిన వాటిని బ్రౌజ్ చేసుకుని నిక్షిప్తం చేసుకోవచ్చు. మరి, మీరూ ఉచిత వీడియో కాలింగ్ ఆప్స్‌ని ప్రయత్నించాలనుకుంటున్నారా? అయితే, వీటిని వాడొచ్చు...
వేగంగా... సురక్షితంగా వీడియో కాల్స్ చేసేందుకు ఇదో వేదిక. సుమారు 300 మిలియన్ల యూజర్లు వాడుతున్నారు. టెక్స్ట్, వాయిస్ మెసేజ్‌లను కూడా పంపుకునే వీలుంది. ఫొటోలు, వీడియోలను కూడా షేర్ చేయవచ్చు. నోటిఫికేషన్స్ ద్వారా అలర్ట్‌లను పొందొచ్చు.అన్ని మొబైల్ ఓఎస్‌లకు అందుబాటులో ఉంది. www.wechat.com
* Tango
వీడియో, వాయిస్ కాల్స్‌ని ఉచితంగా చేసుకోవచ్చు. స్నేహితులు, కుటుంబ సభ్యుల్ని నిత్యం పలకరించేందుకు ఇదో చక్కని ఆప్. ఇన్‌స్టాల్ చేసి రన్ చేయగానే ఆటోమాటిక్‌గా ఆప్‌ని వాడుతున్న వారిని చూపిస్తుంది. 50 మంది స్నేహితులతో గ్రూప్ ఛాట్ చేయవచ్చు. యానిమేషన్ బొమ్మలతో మెసేజ్‌లను పంపే వీలుంది. కలిసి గేమ్స్ ఆడొచ్చు. ఆండ్రాయిడ్, యాపిల్, విండోస్ ఫోన్ యూజర్లు యాప్‌ని వాడొచ్చు.డెస్క్‌టాప్ పీసీల్లోనూ వాడొచ్చు. www.tango.me
* Fring Free
గ్రూపు కాల్స్ చేసేందుకు వాడొచ్చు. నలుగురితో ఒకేసారి వీడియో ఛాట్ చేయవచ్చు. ఉచితంగా టెక్స్ట్ మెసేజ్‌లు పంపొచ్చు. నోకియా సింబియాన్ యూజర్లూ వాడుకునే వీలుంది. www.fring.com
* Qik Video
వీడియో ఛాటింగ్ మాత్రమే కాకుండా మీరు చిత్రీకరించిన వీడియోలను స్ట్రీమింగ్ పద్ధతిలో పంచుకునేందుకు వీలుంది. రికార్డ్ చేసిన వీడియోలను సోషల్ నెట్‌వర్క్‌లో పోస్ట్ చేయవచ్చన్నమాట. http://qik.com
* ooVoo
ఒకేసారి 12 మంది స్నేహితులతో గ్రూపు ఛాట్ చేయవచ్చు. హై-డిఫినెషన్‌లో వీడియోలను చూడొచ్చు. నలుగురు స్నేహితుల్ని తెరపై చూడొచ్చు. వీడియోని చిత్రీకరించి స్టేటస్‌గా పెట్టుకునే వీలుంది. www.oovoo.com
* imo
కమ్యూనిటీగా ఏర్పడి వీడియో కాల్స్ చేయవచ్చు. స్నేహితులు, కుటుంబ సభ్యులతో గ్రూప్స్ క్రియేట్ చేయవచ్చు. https://imo.im
* Line
వాయిస్ కాల్స్‌తో పాటు వీడియో కాల్స్‌ని సపోర్ట్ చేస్తుంది. మెసేజ్‌లు కూడా పంపొచ్చు. http://line.naver.jp
* Camfrog
ఇదో వీడియో ఛాట్ కమ్యూనిటీ. ఆండ్రాయిడ్ యూజర్లుhttp://goo.gl/0NuphF లింక్ నుంచి పొందొచ్చు.
0 comments:
Post a Comment